స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. తోటి నటులైన కుటుంబ సభ్యుల నుంచి కావాల్సినంత మద్దతు దక్కి తద్వారా వాళ్ళ అభిమానులను ఆకట్టుకునే ఛాన్స్ కొట్టేయొచ్చు. ఇది తప్పేం కాదు. అందరూ చేసేదే. నాగ చైతన్య అఖిల్ లు పరస్పరం తమ కొత్త రిలీజులు జరుగుతున్నప్పుడు ఒకరినొకరు ఆల్ ది బెస్ట్ చెప్పుకోవడం చాలాసార్లు చూశాం. తమ్ముడు గణేష్ ని లాంచ్ చేసిన స్వాతిముత్యం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అసలు మీడియాకే దొరక్కుండా పోయిన బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ప్రత్యేక అతిథిగా రావడం తెలిసిందే. ఈ మాత్రం ఉండకపోతే ఎలా.
మ్యాటర్ కొస్తే అల్లు శిరీష్ కొత్త సినిమా ఊర్వశివో రాక్షసివో విడుదలకు సిద్ధమైన తరుణంలో అన్నయ్య ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నుంచి ఒక్క ట్వీట్ లేకపోవడం ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరిచింది. ఆ మధ్య బ్రహ్మానందం అబ్బాయి గౌతమ్ మూవీ టీజర్ ని లాంచ్ చేసిన బన్నీకి ఓన్ బ్రదర్ మూవీ ఇంత గ్యాప్ తర్వాత రిలీజవుతుందంటే దాని గురించి కనీస ప్రస్తావన తేకపోవడం విచిత్రమే. దీనికి ఏ మాత్రం సంబంధం లేని బాలకృష్ణ అల్లు అరవింద్ అడగ్గానే గెస్టుగా వచ్చారు. దాని వెనుక ఆహా అన్ స్టాపబుల్ షో కారణం కావొచ్చు కానీ ఈజీగా నో చెప్పడానికి ఛాన్స్ ఉందిగా. కానీ వచ్చారు.
మరి శిరీష్ విషయంలో అల్లు అర్జున్ మౌనంగా ఎందుకు ఉన్నారో అర్థం కావడం లేదు. ఇక్కడ మరో కోణం ఉంది. ఊర్వశివో రాక్షసివో ప్యూర్ రొమాంటిక్ ఎంటర్ టైనర్. ముద్దు సీన్లు, ఇంటిమసీ సన్నివేశాలు దట్టించారు. ఇలాంటి జానర్ ని అల్లు అర్జున్ ఎప్పుడూ టచ్ చేయలేదు. తన ఇమేజ్ కి సూట్ కాదు కూడా. పుష్ప తర్వాత ప్యాన్ ఇండియా ఇమేజ్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడీ సినిమాను ప్రమోట్ చేస్తే నార్త్ ఫ్యాన్స్ దీన్ని మరో యాంగిల్ లో అనుకునే రిస్క్ అనిపించిందో ఏమో ఫైనల్ గా ఎలాంటి ఊసు లేదు. ఒకవేళ మూవీ హిట్ అయితే సక్సెస్ మీట్ కి వచ్చే ప్లాన్ ఉందో ఏమో.
This post was last modified on %s = human-readable time difference 6:47 pm
బహుశా నిఖిల్ కెరీర్ లోనే తక్కువ సౌండ్ తో వస్తున్న సినిమా అప్పుడో ఇప్పుడో ఎప్పుడో. నవంబర్ 8 విడుదలలో…
ప్రపంచంలో ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌గా ఉన్న వాట్సాప్ అనుచిత ఖాతాలపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో, సెప్టెంబర్ నెలలో…
గత వైసీపీ హయాంలో జగన్ సాగించిన పాలన ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు విషమ పరీక్షలు పెడుతోందనే భావన కూటమి…
ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 120 రోజులపాటు విజయవంతమైన…
ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే మొదటి ప్యాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు పార్ట్ 1…
ఒక చిన్న పల్లెటూరు. దాని వెనుకో రహస్యాన్ని దాచుకున్న క్రైమ్. అది ఛేదించడానికి హీరో రంగంలోకి దిగుతాడు. ఊహించని ట్విస్టులతో…