ఆర్ఆర్ఆర్ సినిమా హీరోలిద్దరూ తమ ఫ్యాన్స్‌తో ఒకే తరహాలోనే ఆడేసుకుంటున్నారు. వాళ్లు కావాలని చేస్తున్నారని అనుకోలేం కాదు, ఎందుకోగాని వాళ్ళ తదుపరి సినిమాల గురించి ఫ్యాన్స్‌లో కూడా రోజురోజుకీ టెన్షన్ పెరిగిపోతోంది. ఒక ప్రక్కన ఎన్టీఆర్30 గురించి రోజుకో రూమర్ వస్తోంది. ఆ సినిమా గురించి కొరటాల శివ ఏమీ చెప్పకపోవడంతో ఇప్పటికే ఫ్యాన్స్ కంగారుపడుతుంటే.. మరో ప్రక్కన తన 16వ సినిమా గురించి రామ్ చరణ్ అసులు ఏం చెప్పకపోవడం ఇప్పుడు మెగా ఫ్యాన్స్‌ను కూడా కంగారుపెడుతోంది.
గౌతమ్ తిన్ననూరి డైరక్షన్లో రావల్సిన #RC16 క్యాన్సిల్ అయిపోయిన సంగతి తెలసిందే. ఆ తరువాత రామ్ చరణ్ ఒక కన్నడ డైరక్టర్‌తో సినిమా చేస్తాడని అనుకుంటే.. దాని గురించి కూడా ఎటువంటి టాక్ లేదు. ఇప్పుడేమో సుకుమార్‌తో సినిమా పక్కా అని టాక్ వినిపిస్తున్నా కూడా, ఒక ప్రక్కన ఆ డైరక్టర్ పుష్ప2 సినిమాతో బిజీగా ఉన్నాడు కాబట్టి, ఇప్పుడప్పుడే ఆ సినిమా మొదలయ్యే ఛాన్సే లేదు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రమోట్ చెయ్యడానకి జపాన్ వెళ్ళిన రామ్ చరణ్.. ఆ పనులు ముగించుకుని అక్కడే ఒక హాలిడే కూడా ప్లాన్ చేసుకున్నాడు. అవన్నీ పూర్తి చేసుకుని గురువారం ఉదయం హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యాడు. ఇప్పుడు వెంటనే తన 16వ సినిమా గురించి ఒక డెసిషన్ తీసుకుని.. త్వరలోనే ఫ్యాన్స్‌కు స్వీట్ న్యూస్ చెబుతాడని అందరూ ఆశిస్తున్నారు.
అయితే హైదరాబాద్‌లో కేవలం మరో వారంరోజులే చరణ్ ఉండబోతున్నాడట. ఆ తరువాత బడా డైరక్టర్ శంకర్ డైరక్షన్లో రూపొందుతున్న సినిమా షూటింగ్ కోసం ఒక 10 రోజుల న్యూజిల్యాండ్ వెళ్ళనున్నాడు. అక్కడ భారీ ఖర్చుతో నిర్మాణ విలువలతో ఒక పాట షూట్ చేయనున్నారు. ఈ పాట పూర్తయ్యాక మళ్లీ ఆ సినిమా తదుపరి షెడ్యూల్ ఇండియాలోనే మొదలవుతుంది. ఈ గ్యాపులోనే చరణ్ తన నెక్ట్స్ సినిమా గురించి ఒక డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. చూద్దాం ఏమవుతుందో!
This post was last modified on November 3, 2022 6:29 pm
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……
అగ్ర రాజ్యం అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఆ దేశ ప్రముఖ వ్యాపారవేత్త డొనాల్డ్ జే ట్రంప్ రెండు రోజుల క్రితం…
ఏపీలో ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. గతంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో సంక్రాంతి వేడుకలు జరిగాయి.…
చాలా ఏళ్ల నుంచి నాసిరకం సినిమాలు తీస్తూ తనకున్న గొప్ప పేరునంతా పోగొట్టుకుని దర్శకుడిగా జీరో అయిపోయాడు రామ్ గోపాల్…