అప్పట్లో పలానా స్టార్‌ను ప్రేమిస్తున్నా అంటూ కాస్త ఓపెన్‌గానే మాట్లాడేది యాపిల్ రంగు బ్యూటి హన్సికా మొత్వాని. కాని తమిళ హీరో శింబుతో ప్రేమ కథను బాగా నడిపేసి, దానిని పెళ్ళి వరకు తీసుకెళ్ళే తరుణంలో ఫెయిలవ్వడంతో.. అమ్మడు తన లవ్‌లైఫ్ పైన పెద్దగా ఓపెన్ కావట్లేదు. చివరకు.. పెళ్ళికి ఇంకో నెల రోజులు ఉందనగా.. ఇప్పుడు కూడా విషయాలన్నీ సీక్రెట్‌గానే ఉంచుతోంది. ఈ ఉదయం ఎయిర్‌పోర్టులో హన్సిక చేసిన స్టంట్స్ అందుకు ఉదాహరణ.
తనతో పాటు కలసి ఈవెంట్ మేనేజ్మెంట్ బిజినెస్ చేస్తున్న బిజినెస్ పార్ట్‌నర్ సొహైల్ కతూరియాను హన్సిక వివాహం చేసుకుంటున్నట్లు రెండు నెలలుగా రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయ్. ఇక డిసెంబర్ 4న వివాహం అంటూ వెడ్డింగ్ జరిగే ప్లేస్‌తో సహా మీడియా పబ్లిక్‌కు చెప్పేయడంతో.. నిన్న ఒక ఫోటో షేర్ చేసిందీ ముద్దుగుమ్మ. కాని ఆ పోస్టులో సొహైల్ గురించి ఒక్కమాట కూడా చెప్పలేదు. ఇకపోతే ఇవాళ ఉదయం ఎయర్‌పోర్టులో కనిపించినప్పుడు.. చేతికి రింగ్ తొడుక్కుని.. అందరికీ షాకిచ్చింది. ఆ రింగ్‌ను కూడా ఏదో అయిష్టంగానే ఫోటోగ్రాఫర్లకు చూపించిందిలే. అయితే ఇంత సీక్రెట్‌గా తన రిలేషన్‌ను ఉంచాల్సిన అవసరం ఏంటనేది చాలామంది అడుగుతున్న క్వశ్చన్.
ప్రస్తుతం హన్సిక స్టార్ హీరోయిన్ కాదు, పోనివ్ రిలేషన్ గురించి చెప్పేస్తే ఆఫర్లు పోతాయని ఫీలవ్వడానికి. తనకు కాబోయే భర్త సొహైల్ కూడా యాక్టర్ కాదు, ఒకవేళ అతని కెరియర్‌కు ఏదన్నా బ్రేక్ పడుతుందేమో అని భయపడటానికి. ఇద్దరూ ఓపెన్‌గా రిలేషన్ గురించి చెప్పేసినా ఎవ్వరూ ఏమీ అనుకోరు. అంతేకాదు, అసలు ఇప్పటివరకు పలానా అతను తనకు కాబోయేవాడు అంటూ అతని గురించి చిన్న క్లూ కూడా ఇవ్వలేదు మన దేశముదురు బ్యూటి. ఒకవేళ తన పార్ట్‌నర్ గురించి బయటకు తెలిస్తే.. ఏమన్నా పాత ప్రేమాయణాలు, తన మాజీ ప్రియుళ్ళు ఏదన్నా ఫిట్టింగ్ పెడతారని కంగారుపడుతోందా ఏంటి?
Gulte Telugu Telugu Political and Movie News Updates