పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలన్నీ నత్తనడకన షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. వకీల్ సాబ్ కూడా గ్యాపులు గ్యాపులుగా షూటింగ్ చేశారు. ఇక భీమ్లా నాయక్ కి కూడా అదే జరిగింది. పాలిటిక్స్ లో పవన్ బిజీ ఉండటంతో సినిమా షూటింగ్ లకు ఎక్కువ డేట్స్ కేటాయించలేకపోతున్నాడు పవన్. ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న హిస్టారికల్ పీరియాడిక్ డ్రామా ‘హరి హర వీరమల్లు’ కి కూడా ఎక్కువ డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతున్నాడు. ఎలక్షన్స్ దగ్గర పడుతుండటంతో పవన్ మరింత బిజీగా ఉంటున్నాడు. దీంతో సినిమా వ్యయం రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతుంది. నిర్మాతను వడ్డీ భారం భయపెడుతుంది.
అందుకే లేటెస్ట్ గా పవన్ ఓ డిసిషన్ తీసుకొని టార్గెట్ ఫిక్స్ చేసుకున్నాడు. వీలైనన్ని డేట్స్ ఇచ్చి సినిమాను కంప్లీట్ చేసే పనిలో పడ్డాడు. ఇటివలే షూటింగ్ మొదలు పెట్టాడు. దానికి ముందు వారం పాటు రిహార్సల్స్ కూడా చేసాడు. అంటే పవన్ ఈ సినిమా మీద ఫుల్ ఫోకస్ పెట్టేశాడన్నమాట. నిజానికి పవన్ ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి చాలా డిలే చేస్తూ వచ్చాడు. పవన్ సరైన డేట్స్ ఇవ్వకపోవడంతో షూటింగ్ బ్రేకులు బ్రేకులుగా సాగింది. మిగతా యాక్టర్స్ డేట్స్ కూడా వృదా అయ్యాయి.
ఎట్టకేలకు పవన్ నిర్మాతలపై పడుతున్న భారం తెలుసుకున్నాడో ఏమో కానీ ఈ సినిమా కోసం అడిగినన్ని డేట్స్ ఇచ్చే ఇకపై ఎలాంటి గ్యాప్ లేకుండా చిన్న చిన్న బ్రేకులతో కంటిన్యూ చేసే ప్లానింగ్ లో ఉన్నాడు. ఇక పవన్ కి అటు రాజకీయంగానూ ఇది కీలక సమయమే ఎలక్షన్స్ హడావుడి అప్పుడే మొదలైపోయింది. ఎవరి వ్యూహాలు వారి రెడీ చేసుకుంటున్నారు. పవన్ మాత్రం వీరమల్లు పూర్తయ్యాకే పాలిటిక్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టాలని భావిస్తున్నాడు. మరి పవర్ స్టార్ ఇదే ప్లానింగ్ కి స్టిక్ అయితే ఫ్యాన్స్ తొందర్లోనే వీరమల్లు ను స్క్రీన్ పై చూడొచ్చు.
This post was last modified on November 3, 2022 9:45 am
‘పుష్ప-2’ బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ తొక్కిసలాటలో మహిళ మృతి కేసుకు సంబంధించి అల్లు అర్జున్ అరెస్ట్…
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పాలిటిక్స్ లో అంతగా క్లిక్ కాకపోయినా కూడా ఓ వర్గం జనాల్లో ఆయనపై మంచి…
హైదరాబాద్ మాదాపూర్‌లోని నాలెడ్జ్ సిటీలో శనివారం ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సత్వ ఎలిక్విర్ భవనంలోని ఐదో అంతస్తులో ఒక్కసారిగా…
ఒకప్పుడు కామెడీ సినిమాలంటే కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన అల్లరి నరేష్ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ చూశాడు.…
వెంకటేష్ ప్రేమంటే ఇదేరాతో ఇండస్ట్రీకి పరిచయమై మొదటి ఆల్బమ్ తోనే సూపర్ హిట్ కొట్టిన సంగీత దర్శకుడు రమణ గోగులకు…
ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు విద్యార్థులకు నైతిక విలువల సలహాదారుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు,…