కొన్నేళ్ల కిందట సినిమాలు పక్కన పెట్టేసి రాజకీయాల్లో బిజీ అవడం చూసి కమల్ హాసన్‌ను మళ్లీ వెండితెరపై చూడలేమో అని ఆందోళన చెందారు అభిమానులు. కానీ మంచికో చెడుకో రాజకీయాల్లో కమల్ ఫెయిలయ్యాడు. తిరిగి సినిమాల వైపు తన దృష్టిని మళ్లించాడు. ‘విక్రమ్’ సినిమాతో బ్లాక్ బస్టర్ రీఎంట్ర ఇచ్చి తన పేరు మార్మోగిపోయేలా చేశాడు లోకనాయకుడు.
ఇప్పుడు ఆయన లాంగ్ డిలేయ్డ్ మూవీ ‘ఇండియన్-2’ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పున:ప్రారంభం అయింది. ఇంకొన్ని నెలల పాటు కమల్ ఈ సినిమాకే అంకితమై ఉంటాడు. దీని తర్వాత ఆయన విక్రమ-2 చేస్తాడా.. ఇంకేదైనా సినిమాను మొదలుపెడతాడా అని అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. లోకేష్ కనకరాజ్ ఇప్పుడిప్పుడే ఖాళీ అయ్యే సూచనలు కనిపించడం లేదు కాబట్టి కమల్ వేరే చిత్రాన్నే టేకప్ చేసే అవకాశముంది.
ఆ సినిమాకు దర్శకుడు ఖరారైనట్లు తాజా సమాచారం. ‘శతురంగ వేట్టై’ అనే చిన్న సినిమాతో దర్శకుడిగా అరంగేట్రంలోనే సంచలనం రేపి, ఆ తర్వాత కార్తితో ‘ఖాకి’ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన హెచ్.వినోద్.. కమల్‌ను డైరెక్ట్ చేయబోతున్నాడట. ‘ఖాకి’ తర్వాత అతను అజిత్‌తో వరుసగా నీర్కొండ పార్వై, వలిమై సినిమాలు తీశాడు. అవి మంచి ఫలితాన్నే అందుకున్నాయి. ఇప్పుడు అజిత్‌తోనే అతను తీస్తున్న ‘తునివు’పై భారీ అంచనాలే ఉన్నాయి. దీని తర్వాత కమల్ సినిమా చేయడానికి అతను రెడీ అవుతున్నాడు.
‘విక్రమ్’ మాదిరే ఈ చిత్రాన్ని కూడా కమల్ తన సొంత నిర్మాణ సంస్థ ‘రాజ్ కమల్ ఇంటర్నేషనల్’లో నిర్మించబోతున్నాడట. వినోద్ శైలికి తగ్ట్లే ఇదొక యాక్షణ్ థ్రిల్లర్ అని సమాచారం. ‘విక్రమ్’తో పాన్ ఇండియా లెవెల్లో కమల్‌కు తిరిగి మంచి క్రేజ్ వచ్చింది. దీని తర్వాత ‘ఇండియన్-2’తో ఆ క్రేజ్ ఇంకా పెరగొచ్చు. కాబట్టి వినోద్‌తో కమల్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీగానే తెరకెక్కే అవకాశముంది.
This post was last modified on November 2, 2022 7:10 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…