ప్రపంచవ్యాప్తంగా అవతార్ 2 ఫీవర్ మాములుగా లేదు. ఇప్పటికిప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్ పెట్టినా వరల్డ్ వైడ్ కలెక్షన్ వందల కోట్లు వచ్చేలా ఉంది. దీని ప్రభావం అన్ని బాషల కొత్త రిలీజుల మీద తీవ్రంగా ఉండబోతోందని ట్రేడ్ ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తోంది. ఉదాహరణకు కేరళ ఎగ్జిబిటర్ల సమాఖ్య డిసెంబర్ 16న దీనికి సాధ్యమైనన్ని ఎక్కువ థియేటర్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుందట. అదే జరిగితే మల్లువుడ్ కు చాలా కీలకమైన క్రిస్మస్ అడ్వాంటేజ్ అవతారే తీసుకుంటుంది. మనకు సంక్రాంతి ఎలాగో వాళ్లకు ఆ పండగ అంతకన్నా ఎక్కువ.
అందుకే స్టార్లు మొదలుకుని చిన్న హీరోల దాకా ఏ మాత్రం అవకాశం ఉన్నా ఆ సీజన్ ని వదులుకునేందుకు ఇష్టపడరు. మరి అవతార్ 2 కనక బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే విద్యాధికులు ఎక్కువగా ఉండే ఆ రాష్ట్రంలో క్లాసు మాస్ తేడా లేకుండా అందరూ దాని మీదే ఎగబడతారు. అక్కడిదో పెద్ద సమస్య అయ్యిందని టాక్. మిగిలిన చోట్ల కూడా పరిస్థితి ఏమంత భిన్నంగా లేదు. నిన్నటి దాకా రణ్వీర్ సింగ్ సర్కస్ అవుట్ ఫుట్ మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉండి డిసెంబర్ 23 రిలీజ్ కు రెడీ అన్న దర్శక నిర్మాత రోహిత్ శెట్టి డిస్ట్రిబ్యూటర్ల ఒత్తిడికి పునరాలోచన చేస్తున్నాడట.
ఇక తెలుగు విషయానికి వస్తే అవతార్ 2 వచ్చిన ఆ పై వారంలో రవితేజ ధమాకా, నిఖిల్ 18 పేజెస్ లు ప్రస్తుతానికి బెర్తులు కన్ఫర్మ్ చేసుకున్నాయి. ఇంకో ఒకటో రెండో తోడయ్యే ఛాన్స్ లేకపోలేదు. తెలుగు రాష్ట్రాల నుంచి ఆల్రెడీ వంద కోట్ల దాకా బిజినెస్ జరగొచ్చనే అంచనా ఉంది. అదే నిజమైతే రెండో వారానికే స్క్రీన్లు తగ్గించే సీన్ ఉండదు. ట్రైలర్ చూశాక హైప్ ఇంతకు పదింతలు ఉంటుందని ఇప్పటికే టాక్ ఉంది. ఏది ఏమైనా అవెంజర్స్ ఎండ్ గేమ్, స్పైడర్ నో వే హోమ్ ని మించిన బజ్ ఈ అవతార్ 2కు కనిపిస్తోంది. పన్నెండేళ్ల తర్వాత సీక్వెల్ అంటే ఆ మాత్రం ఉంటుంది మరి.
This post was last modified on November 2, 2022 11:24 am
ఏపీలో కూటమి ప్రభుత్వం ఓ పక్క సంక్షేమం, మరో పక్క రాష్ట్రాభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. వృద్ధులు, ఒంటరి…
నందమూరి బాలకృష్ణ కెరీర్లో తొలి పాన్ ఇండియా మూవీ.. అఖండ-2. అఖండ సినిమా ఓటీటీలో రిలీజై నార్త్ ఇండియాలోనూ మంచి…
సాధారణంగా సినిమాల ఫలితాల విషయంలో హీరోయిన్ల వాటా తక్కువ అన్నది వాస్తవం. మన సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు ప్రాధాన్యం తక్కువగానే ఉంటుంది. ఎక్కువగా వాళ్లు గ్లామర్…
పెద్ద సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఆలస్యం కావడం ఇటీవల పెద్ద సమస్యగా మారుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు…
అధికారంలోకి రాకముందు.. ప్రజల మధ్య ఉండే పార్టీల గురించి తెలుసు. కానీ, అధికారం వచ్చిన తర్వాత కూడా నిరంతరం ప్రజలను…
"రూపాయి విలువ పడిపోయింది" అనే వార్త చూడగానే.. "మనకేంటిలే, మనం ఇండియాలోనే ఉన్నాం కదా" అని లైట్ తీసుకుంటే పొరపాటే.…