మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ప్లాన్ చేసుకున్న సినిమా క్యాన్సిల్ కావడం ఫ్యాన్స్ కి ఒకింత రిలీఫ్ నే ఇచ్చింది. సెన్సిబుల్ కథలనే బాగా చెప్పగలడన్న పేరు తెచ్చుకున్న గౌతమ్ ప్యాన్ ఇండియా ఇమేజ్ తో ఇప్పుడు లెక్కలు మారిపోయిన చరణ్ ను ఎలా డీల్ చేస్తాడన్న అనుమానం వాళ్లలో ముందు నుంచి ఉంది. పైగా జెర్సీ హిందీ రీమేక్ దారుణంగా డిజాస్టర్ కావడం ఆ భయాన్ని ఇంకాస్త పెంచింది. వాస్తవానికి గౌతమ్ రెడీ చేసుకున్నది యాక్షన్ సబ్జెక్టే. ఫైనల్ వెర్షన్ ని చరణ్ మెచ్చేలా నెరేట్ చేయకపోవడంతో ఆగిపోయిందని మెగా కాంపౌండ్ న్యూస్.
సరే గౌతమ్ ది తేలిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వెంకీ కుడుముల గురించి క్లారిటీ రావాల్సి ఉంది. డివివి దానయ్య నిర్మాణంలో చిరంజీవి హీరోగా ఈ ప్రాజెక్టు నెలల క్రితమే ప్రకటించారు. అయితే వెంకీ సైతం మెగాస్టార్ ని పూర్తి స్థాయిలో మెప్పించలేకపోతున్నాడనే వార్తలు గట్టిగానే చక్కర్లు కొట్టాయి. నేరుగా అడుగుదామంటే అతను బయట కనిపించడం బొత్తిగా తగ్గించేశాడు. గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాబీ, మెహర్ రమేష్ లు ఉన్నారు కానీ వెంకీ కుడుముల మాత్రం అడ్రెస్ లేడు. ఆచార్యతో మొదలుపెడితే ఏ ప్రమోషన్ లోనూ చిరంజీవి తన ప్రస్తావన తీసుకురాలేదు.
ఒకవేళ నిజంగా నో అనుకుంటే అదేదో వీలైనంత త్వరగా బయటికి చెప్పేస్తే ఫ్యాన్స్ కి క్లారిటీ ఉంటుంది. భీష్మ లాంటి పెద్ద హిట్టు ఇచ్చాక కూడా వెంకీ కుడుములకు ఇంత గ్యాప్ రావడం కరెక్ట్ కాదు. మీడియం రేంజ్ హీరోలకు అసలే డైరెక్టర్లు దొరక్క సరైన కథలు లేని డెబ్యూ దర్శకులను నమ్ముకుని ఫ్లాపులు చూస్తున్నారు. అలాంటిది కుడుముల టైమింగ్ ని వాడుకోకపోవడం కరెక్ట్ కాదు. పైగా త్రివిక్రమ్ శిష్యుడాయే. ఇవన్నీ చూస్తుంటే ఒకప్పుడు దాసరి నారాయణరావు, కోదండరామిరెడ్డి, రాఘవేంద్రరావు లాంటి అగ్రదర్శకులు ఏడాదికి అయిదారు ఎలా చేసేవారో అనిపిస్తుంది కదూ.
This post was last modified on November 2, 2022 6:53 pm
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…