సక్సెస్ ఉన్న హీరోకి ఏ ఇండస్ట్రీలో అయినా తిరుగుండదు. అయితే విశ్వక్ సేన్ మాత్రం ఇందుకు మినహాయింపు అనుకోవచ్చు. అవును ఫలక్ నుమా దాస్ తర్వాత విశ్వక్ కి ఇంత వరకూ సరైన హిట్ పడలేదు. హిట్ ఒక్కటే ఓ మోస్తరుగా ఆడింది. ‘పాగల్’ డిజాస్టర్ అనిపించుకోగా , ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ పర్లేదు అనే టాక్ అందుకుంది కానీ ఫైనల్ గా కలెక్షన్స్ తెచ్చిపెట్టలేకపోయింది.
ఇక రీసెంట్ గా విశ్వక్ తమిళ్ లో సూపర్ హిట్టయిన ‘ఓ మై కడవులే’ సినిమాను ‘ఓరి దేవుడా’ పేరుతో రీమేక్ చేసి ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కానీ ఆ సినిమా కూడా పనవ్వలేదు. దీపావళి స్పెషల్ గా వచ్చిన ఈ సినిమా కనీసం మంచి ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోయింది.
అయితే ఇవన్నీ విశ్వక్ కి ఎలాంటి ఇబ్బంది కలిగించడం లేదు. హిట్ , ఫ్లాప్ అనేది పట్టించుకోకుండా కుర్ర హీరోకి ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. ప్రస్తుతం విశ్వక్ సేన్ సొంత బేనర్ లో తనే దర్శకుడిగా ‘మాస్ కా దంకీ’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటే అర్జున్ సార్జా దర్శకత్వంలో ఇంకో సినిమా చేస్తున్నాడు. తాజాగా మరో ప్రాజెక్ట్ కూడా లైనప్ లో పెట్టేశాడు. సాహిత్ అనే దర్శకుడితో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా ఓ పెద్ద బేనర్ లో రూపొందనుందని టాక్. ఇవి కాకుండా మరో రెండు ప్రాజెక్ట్స్ కూడా డిస్కషన్స్ లో ఉన్నాయట.
ఇక మైత్రి , సితార సంస్థలు కూడా విశ్వక్ కి అడ్వాన్స్ లు ఇచ్చాయని టాక్ ఉంది. సో హిట్ లేకపోయినా విశ్వక్ డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. సరైన హిట్ పడితే ఈ యంగ్ హీరో చుట్టూ మరింత మంది నిర్మాతలు ఈగల్లా వాలడం ఖాయమనిపిస్తుంది. మరి ‘దాస్ కా దమ్కీ’ తో తనకి తనే హిట్ ఇంచుకుంటాడేమో చూడాలి.
This post was last modified on November 2, 2022 11:11 am
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఫ్యాన్స్ కోసం లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనప్పటికీ…
ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందబోయే ప్యాన్ ఇండియా మూవీ మీద…