Movie News

స్టారాధిస్టార్లు – ప్లానింగ్ పొరపాట్లు

ఒకప్పుడు 80 దశకంలో ఒకే ఏడాదిలో పధ్నాలుగు సినిమాల్లో నటించిన ట్రాక్ రికార్డు మెగాస్టార్ చిరంజీవికి ఉంది. అంతకన్నా ఎక్కువ సూపర్ స్టార్ కృష్ణ చేశారు. ఇంకా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే తెల్లవారకుండానే నిద్ర లేవడంతో మొదలు అర్ధరాత్రి దాకా షూటింగులే ప్రపంచంగా మారిపోయిన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి దిగ్గజాల ఉదంతాలు చెప్పుకుంటూ పోతే అంతూపొంతూ ఉండదు. సరే అప్పటి పరిస్థితులు, మార్కెట్ పరిమితులు వేరు పోల్చడం కరెక్ట్ కాదు కాబట్టి మరీ లోతుగా వెళ్లడం వద్దు కానీ వంద కోట్లకు పైగా మార్కెట్ ఉన్న టైర్ 1 స్టార్లు ఏడాదికి కనీసం ఒకటి రెండు సినిమాలు చేయకపోతే అభిమానులకే కాదు ఇండస్ట్రీ మనుగడకూ కష్టమే.

అసలేం జరుగుతుందో చూద్దాం. అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 1 రిలీజై ఇంకో నెల దాటితే ఏడాది అవుతుంది. ఇప్పటికీ రెండో భాగం రెగ్యులర్ షూట్ కు వెళ్ళలేదు. అదిగో ఇదిగో అంటూ వర్కింగ్ స్టిల్స్ తో కాలయాపన చేస్తున్నారు తప్ప కరెక్ట్ డేట్ చెప్పడం లేదు. ఆర్ఆర్ఆర్ వచ్చి ఎనిమిది నెలలవుతున్నా కొరటాల శివతో చేయబోతున్న తన 30వ సినిమా తారక్ ఇంకా సెట్స్ పైకి తీసుకెళ్లనే లేదు. మహేష్ బాబు త్రివిక్రమ్ లది స్టార్ట్ కావడమే ఆలస్యంగా మొదలయ్యింది. ఇందిరగారి మరణం లాంటి జెన్యూన్ రీజన్స్ ఉన్నాయి కానీ అంతకు ముందు నెలల తరబడి ఎదురుచూపుల్లోనే చాలా సమయం గడిచిపోయింది. జనసేనలో బిజీ అయిపోయి పవన్ కళ్యాణ్ సైతం తన దశదిశను బాలన్స్ చేయలేకపోతున్నారు

ఇక ప్రభాస్ సంగతి సరేసరి. ఫ్రెష్ గా ఆది పురుష్ బాంబు వేశారు. ఇప్పుడు దీని కొత్త డేట్ ని బట్టే సలార్ సెప్టెంబర్ లో వస్తుందా రాదా అనేది డిసైడ్ అవుతుంది. 2023 సంక్రాంతికని చెప్పిన రామ్ చరణ్ శంకర్ ల సినిమా అసలు వచ్చే ఏడాది రావడమే డౌట్ అంటున్నారు. గౌతమ్ తిన్ననూరిది క్యాన్సిలైన విషయం అఫీషియల్ గా చెప్పలేదు. అందరికీ సహేతుకమైన కారణాలు ఉండొచ్చు కానీ ఇలా రెండేళ్లకో సినిమా అంటే మాత్రం చిక్కులే. ఒకపక్క నిఖిల్, రిషబ్ శెట్టి, యష్ లాంటి అప్ కమింగ్ హీరోలు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్న పోటీ వాతావరణంలో ఇకపై ఇలాంటి కాలయాపనలు జరగకూడదు.

This post was last modified on November 9, 2022 12:07 pm

Share
Show comments
Published by
Satya
Tags: Tollywood

Recent Posts

‘మనుషుల ప్రాణాల కంటే కుక్కలకు విలువ ఎక్కువా ?’

దేశవ్యాప్తంగా వీధికుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో జరిగిన విచారణలో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మానవ ప్రాణాల భద్రతకు…

28 minutes ago

బాబీది టీజర్… అనిల్‌ది ట్రైలర్

ప్రతి అభిమానికీ తన ఆరాధ్య కథానాయకుడిని తెరపై ఒకలా చూసుకోవాలనే ఆశ ఉంటుంది. తన హీరో బలాన్ని గుర్తించి.. తన…

2 hours ago

ఎంపీ ఈటల వర్సెస్ ఎమ్మెల్యే మర్రి

రాజకీయాలలో ప్రజలకు అవసరమైన పనులు చేయడం ఎంత ముఖ్యమో… అందుకు సంబంధించిన క్రెడిట్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. అయితే,…

2 hours ago

చూపు లేకపోయినా చిరంజీవి కోసం

అభిమానానికి ఏదీ అడ్డు కాదు అనడానికి ఇది ఉదాహరణ. కంటి చూపు లేని ఒక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి మీద…

3 hours ago

మారుతి అడ్రస్ ఛాలెంజ్… టోల్ మెటీరియల్ ఐపోయింది

సినిమాను ప్రమోట్ చేయడంలో భాగంగా.. ఈ మధ్య సినీ జనాలు స్టేజ్‌ల మీద పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం రివాజుగా…

4 hours ago

శృతి లాగే శ్రీలీల.. పవన్ హిట్ ఇస్తాడా?

​టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల ప్రస్తుతం కెరీర్ పరంగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. 'ధమాకా' సినిమాతో ఓ రేంజ్ క్రేజ్ సంపాదించుకున్న…

4 hours ago