జూనియర్ ఎన్టీఆర్ 30వ సినిమా విషయంలో ఎడతెగని చర్చలే తప్ప.. ఇప్పటిదాకా ఆ సినిమా సెట్స్ మీదికే వెళ్లలేదు. ‘ఆర్ఆర్ఆర్’ పని పూర్తి చేసి ఏడాది కిందటే తారక్ ఫ్రీ అయిపోయినా ఇప్పటిదాకా తర్వాతి చిత్రాన్ని మొదలుపెట్టకపోవడంపై అభిమానులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ సినిమాను అనౌన్స్ చేసి మాత్రం ఏడాదిన్నర దాటిపోయింది. ‘జనతా గ్యారేజ్’ తర్వాత మళ్లీ కొరటాలతో తారక్ సినిమా చేయబోతున్నాడని ముందు అభిమానులు చాలా ఎగ్జైట్ అయ్యారు కానీ.. గత కొన్ని నెలల్లో పరిణామాలు చూశాక మాత్రం వారిలో కంగారు మొదలైంది.
కొరటాల చివరి సినిమా ‘ఆచార్య’ డిజాస్టర్ కావడం, తారక్ కోసం స్క్రిప్టు తయారు చేసే పని ఎంతకీ తెగకపోవడం, ఈ స్క్రిప్టు సంతృప్తికరంగా రాలేదన్న ఊహాగానాలు తారక్ అభిమానులను టెన్షన్ పెడుతున్నాయి. అసలీ సినిమా ఉంటుందా అన్న సందేహాలు కూడా ఒక దశలో వ్యక్తమైనప్పటికీ.. తారక్ దీనికే కట్టుబడి ఉన్నాడన్న సంకేతాలే అతడి వైపు నుంచి వచ్చాయి.
ఇలాంటి టైంలో ఎన్టీఆర్-కొరటాల సినిమా గురించి అప్‌డేట్ అంటూ ఈ రోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో అందరూ హోరెత్తించేశారు. ఈ సినిమాకు టైటిల్ ఏమైనా ఖరారు చేశారేమో.. లేక ఫలానా రోజు సినిమా మొదలవుతుందని చెబుతారేమో అని అనుకుంటే.. చివరికి అలాంటిదేమీ లేకపోయింది. ఈ సినిమా క్యాన్సిల్ కాలేదు, త్వరలోనే మొదలవుతుంది అన్నదే ఈ అప్‌డేట్. ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలులతో కలిసి ప్రి ప్రొడక్షన్ పనులను కొరటాల పూర్తి చేసినట్లు, నవంబరు నెలాఖరు నుంచి ఈ సినిమా కోసం అనిరుధ్ మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలుపెడతాడని కూడా సమాచారం ఇచ్చారు.
ఐతే ఈ సినిమా క్యాన్సిల్ కాలేదు, ఉంది అని చెప్పడం కూడా ఒక అప్‌డేటేనా అని తారక్ ఫ్యాన్స్ నిట్టూరుస్తున్నారు. అసలు సినిమా రద్దయిందని ఎవరు ఫిక్సయ్యారు, ఖండిస్తూ అప్‌డేట్ ఇవ్వడానికి అనే ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇంకా ఎన్నాళ్లు తారక్ సమయాన్ని వృథా చేస్తారు.. సరిగ్గా సినిమాను ఎప్పుడు మొదలుపెడతారో, ఎప్పుడు రిలీజ్ చేస్తారో చెప్పాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు.
This post was last modified on October 31, 2022 3:38 pm
ఏఐ.. ఏఐ.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మాట. దాని సాయంతో అద్భుతాలు చేస్తోంది యువతరం. ఐతే దీన్ని వినోదం…
బీజేపీకి ఉత్తరాదిలో ఉన్న బలం.. దక్షిణాదికి వచ్చే సరికి లేకుండా పోయింది. నిజానికి బండి సంజయ్, కిషన్రెడ్డి, పురందేశ్వరి వంటివారు…
తెలుగులో ఫ్రాంఛైజీ చిత్రాలకు ఊపు తెచ్చిన చిత్రం.. హిట్. నాని నిర్మాణంలో శైలేష్ కొలను రూపొందించిన ‘హిట్: ది ఫస్ట్…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కు ఎదురైన అనుభవం చాలా పెద్దదే. అయితే.. ఆయన దాని నుంచి ఎంత…
కొన్ని పాటలు కొన్ని సందర్భాలకే సూట్ అవుతాయి. ఈ విషయాన్ని ఎమ్మెల్సీ కవిత మర్చిపోతున్నారా? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వేళ…
సినిమాల వరకు స్టార్ డంని నిర్ణయించేది మాస్ ప్రేక్షకులే. అందులో సందేహం లేదు. దివంగత ఎన్టీఆర్ నుంచి ఇప్పటి మహేష్…