రామ్ పోతినేని టెంప్ట్ అవ్వట్లేదంతే!

ఇస్మార్ట్ శంకర్ తో మాస్ ని మెప్పించిన రామ్ రెడ్ లో కూడా మాస్ లక్షణాలున్న క్యారెక్టర్ చేసాడు. తనకు వచ్చిన మాస్ ఇమేజ్ ని కన్సాలిడేట్ చేసుకోవాలని రామ్ కృత నిశ్చయంతో ఉన్నాడు. అందుకే రెడ్ సినిమాను థియేటర్లలో మాత్రమే విడుదల చేయాలని ఫిక్సయ్యాడు.

ఓటిటి సంస్థలు ఎంత టెంప్టింగ్ ఆఫర్ తో వచ్చినా కానీ రామ్ అస్సలు తగ్గడం లేదట. రెడ్ తన సొంత సినిమా కావడంతో నిర్మాత వైపు నుంచి ప్రెజర్ కూడా లేదు. దాంతో ముప్పై కోట్ల ఆఫర్ వచ్చినా కాదనేశాడు. ఇస్మార్ట్ తర్వాత తన సినిమాకు థియేటర్స్ నుంచి ఆ మాత్రం ఈజీగా వస్తుందని, ఓటిటి నుంచి మాములుగా వచ్చేది ఎలాగో వస్తుందని, రిలీజ్ ఆపుకుని కూర్చున్న మిగతా సినిమాలతో పాటు రెడ్ ని కూడా వెయిటింగ్ లో ఉంచేసాడు.

ఒక్క మీడియం రేంజ్ సినిమా హక్కులు దక్కించుకున్న కానీ తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది సబ్స్క్రైబర్స్ని సంపాదించుకోవచ్చునని తమ మార్కెట్ ని మించి ఓటిటీలు ఆఫర్ చేస్తున్నాయి. కానీ మన హీరోలు తమ మార్కెట్ డౌన్ అయ్యే ఎలాంటి తొందరపాటు చర్యకు సిద్ధంగా లేరు.