Movie News

బాల‌య్య కోసం ప‌ర‌శురామ్ క‌థ‌

గీత గోవిందం వ‌ర‌కు మిడ్ రేంజ్ సినిమాలే చేస్తూ వ‌చ్చాడు ప‌ర‌శురామ్. అప్ప‌టికి అత‌డికి అవ‌కాశం ఇచ్చిన‌ పెద్ద స్టార్ అంటే ర‌వితేజ‌నే. వీరి క‌ల‌యిక‌లో వ‌చ్చిన సారొచ్చారు పెద్ద డిజాస్ట‌ర్ కావ‌డం తెలిసిందే. ఆ త‌ర్వాత శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు సినిమాతో బౌన్స్ బ్యాక్ అయిన ప‌ర‌శురామ్.. అప్ క‌మింగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో గీత గోవిందం లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ ఇచ్చి హాట్ షాట్ డైరెక్ట‌ర్‌గా మారాడు. దీని త‌ర్వాత ఏకంగా సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో సినిమా చేసే అవ‌కాశం వ‌చ్చింద‌త‌డికి.

ఐతే మ‌హేష్ అభిమానులు పెట్టుకున్న అంచ‌నాల‌ను స‌ర్కారు వారి పాట‌తో అత‌ను అందుకోలేక‌పోయాడు. ఈ సినిమా ఓ మోస్త‌రు ఫ‌లితాన్నందుకుంది. దీని త‌ర్వాత త‌న కొత్త చిత్రాన్ని మొద‌లుపెట్టే విష‌యంలో ప‌ర‌శురామ్ కొంత ఇబ్బంది ప‌డుతున్నాడు. నాగ‌చైత‌న్య‌తో ఇంత‌కుముందు అనుకున్న సినిమా ముందుకు క‌దులుతున్న సంకేతాలేమీ క‌నిపించ‌డం లేదు.

ఐతే ఇప్పుడు ఉన్న‌ట్లుండి ప‌ర‌శురామ్ దృష్టి సీనియ‌ర్ హీరో నంద‌మూరి బాల‌కృష్ణ మీద ప‌డ‌డం విశేషం. అల్లు శిరీష్ హీరోగా తెర‌కెక్కిన ఊర్వ‌శివో రాక్ష‌సివో సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో తాను బాల‌య్య కోసం క‌థ రెడీ చేస్తున్న విష‌యాన్ని ప‌ర‌శురామ్ స్వ‌యంగా వెల్ల‌డించాడు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వ‌చ్చిన బాల‌య్య‌ను ఉద్దేశించి ప‌ర‌శురామ్ మాట్లాడుతూ.. త్వ‌ర‌లోనే ఒక అద్భుత‌మైన క‌థ‌తో మిమ్మ‌ల్ని క‌లుస్తా సార్, ఆల్రెడీ అల్లు అర‌వింద్ గారికి కూడా ఈ విష‌యం తెలుసు అని అన్నాడు. ఇదేదో య‌థాలాపంగా అన్న మాట‌లా క‌నిపించ‌డం లేదు.

అన్‌స్టాప‌బుల్ షోతో ఆహాకు పెద్ద అసెట్‌గా మారిన బాల‌య్య‌తో అల్లు వారికి మంచి అనుబంధం ఏర్ప‌డింది. ఈ క్ర‌మంలోనే ఊర్వ‌శివో రాక్ష‌సివో సినిమా ఈవెంట్‌కు బాల‌య్య అతిథిగా వ‌చ్చాడు. ఆయ‌న‌తో ఓ సినిమా కూడా చేయాల‌ని అర‌వింద్ చూస్తున్న‌ట్లు ఇప్ప‌టికే వార్త‌లొస్తున్నాయి. ప‌ర‌శురామ్ మాట‌ల్ని బ‌ట్టి చూస్తే అత‌డి క‌థ‌తోనే బాల‌య్య‌ను మెప్పించే ప్ర‌య‌త్నం చేయ‌బోతున్న‌ట్లున్నారు.

This post was last modified on October 31, 2022 7:38 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏపీలో.. టైం టేబుల్ పాల‌న‌!!

సాధార‌ణంగా ప్ర‌తి ప్ర‌భుత్వం త‌న ప‌ని తాను చేసుకుని పోతుంది. ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్ర‌ణాళిక‌లు.. కొన్ని…

35 minutes ago

స‌లార్-1పై నిరాశ‌.. స‌లార్-2పై భ‌రోసా

బాహుబ‌లి-2 త‌ర్వాత వ‌రుస‌గా మూడు డిజాస్ట‌ర్లు ఎదుర్కొన్న ప్ర‌భాస్‌కు స‌లార్ మూవీ గొప్ప ఉప‌శ‌మ‌నాన్నే అందించింది. వ‌ర‌ల్డ్ వైడ్ ఆ…

7 hours ago

సినీప్రముఖుల ఇళ్ళపై రాళ్ల‌దాడి.. సీఎం రేవంత్ రియాక్ష‌న్!

ఐకాన్ స్టార్‌.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొంద‌రు వ్య‌క్తులు దాడికి దిగిన విష‌యం తెలిసిందే. భారీ ఎత్తున…

8 hours ago

తాతకు త‌గ్గ‌ మ‌న‌వ‌డు.. నారా దేవాన్ష్ `రికార్డ్‌`

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌న‌వ‌డు, మంత్రి నారా లోకేష్‌, బ్రాహ్మ‌ణి దంప‌తుల కుమారుడు నారా దేవాన్ష్‌.. రికార్డు సృష్టించారు. ఇటీవ‌ల…

9 hours ago

అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి.. ఎవరి పని?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో కొంద‌రు ఆందోళ‌న కారుల‌ను పోలీసులు అరెస్టు…

12 hours ago

అల్లు అర్జున్‌కు షాక్‌.. వీడియో బ‌య‌ట పెట్టిన సీపీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మ‌రింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేట‌ర్ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టికే ఏ11గా కేసు న‌మోదు…

12 hours ago