దర్శకుడు మారుతి ట్రాక్ రికార్డును పట్టించుకోకుండా అతడికి తనతో సినిమా చేసే అవకాశం కల్పించాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఐతే మారుతి ఇప్పటిదాకా చేసినవన్నీ మిడ్ రేంజ్ సినిమాలే. అందులో కొన్ని బాగా ఆడాయి. కొన్ని తుస్సుమనిపించాయి. ‘మహానుభావుడు’ తర్వాత అయతే మారుతి ట్రాక్ రికార్డు ఏమీ బాగా లేదు. ‘ప్రతి రోజు పండగే’ చిత్రానికి ఏదో టైం కలిసి వచ్చి ఓ మోస్తరుగా ఆడేసింది. ‘మంచి రోజులు వచ్చాయి’ బోల్తా కొట్టింది. ‘పక్కా కమర్షియల్’ అయితే అడ్రస్ లేకుండా పోయింది.
ఇలాంటి దర్శకుడితో ప్రభాస్ సినిమా చేయడం ఏంటి అని అభిమానులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందంటే.. కనీసం ఈ సినిమా ప్రారంభోత్సవం గురించి ఒక ప్రకటన చేయడానికి కూడా భయపడ్డారు. సినిమా గురించి ఏ రకమైనా ప్రకటన లేదు. ఏ అప్‌డేట్ ఇస్తే అభిమానులు ఎలా స్పందిస్తారో అని దర్శక నిర్మాతలు భయపడుతున్నట్లున్నారు.
తాజాగా మారుతి ‘లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌కు అతిథిగా వచ్చాడు. ఆ సినిమా గురించి, హీరో సంతోష్ శోభన్ గురించి చాలా బాగా మాట్లాడాడు. ఐతే తన ప్రసంగాన్ని ముగించబోతుండగా.. సంతోష్ శోభన్ వచ్చి ఏమైనా అప్‌డేట్ ఇస్తారా అంటూ మారుతిని అడిగాడు. అతడి ఉద్దేశం ప్రభాస్ సినిమా గురించి ఏమైనా చెప్పమని.. దానికి మారుతి స్పందిస్తూ.. “ఫ్యాన్స్ నన్ను కొడతారు” అని నవ్వేసి ఆ సినిమా గురించి తాను మాట్లాడనని చెప్పకనే చెప్పేశాడు.
మారుతి సరదాగా స్పందించినా.. తాను ప్రభాస్‌తో సినిమా చేస్తుండడం పట్ల అభిమానుల్లో ఎంత వ్యతిరేకత ఉందో అతడికి బాగానే అర్థమైనట్లుంది. ఈ సంగతి పక్కన పెడితే.. ఇటీవలే ప్రభాస్‌తో మారుతి సినిమా సెట్స్ మీదికి వెళ్లింది. ఒక వారం రోజులకు పైగా తొలి షెడ్యూల్ నడిచింది. అందులో మూడు రోజులు ప్రభాస్ షూట్‌లో పాల్గొన్నాడు. మిగతా రోజులు వేరే నటీనటులపై సన్నివేశాలు చిత్రీకరించారు.
This post was last modified on October 30, 2022 5:52 pm
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……