నిన్న మధ్యాన్నం తన జబ్బు గురించి సమంత సోషల్ మీడియాలో ట్వీట్ చేసాక అభిమానులకే కాదు ఇండస్ట్రీలోనూ అది హాట్ టాపిక్ అయ్యింది. ఆ మధ్య కరణ్ జోహార్ టాక్ షోలో అక్షయ కుమార్ తో కలిసి పాల్గొన్నాక సామ్ మళ్ళీ బయట ఎక్కడా కనిపించలేదు. విజయ్ దేవరకొండతో చేస్తున్న ఖుషి షూటింగ్ వాయిదా పడ్డానికి కారణం తనేననే ప్రచారం జరిగినప్పటికీ ఆ వార్తను ఖండిస్తూ కానీ సమర్థిస్తూ కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. తీరా హఠాత్తుగా తనకో వ్యాధి ఉందని చెప్పాక ఫ్యాన్స్ హతాశులయ్యారు. సామాన్యులు అసలెప్పుడూ వినని పేరుతో చికిత్స తీసుకుంటున్నానని చెప్పేసరికి షాక్ తిన్నారు.
త్వరగా లేదా కొంత టైం తీసుకునో సామ్ కోలుకోవడం కన్ఫర్మే. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. కానీ ఈ మయోసైటిస్ తీవ్రత మీద అవగాహన ఉన్న వాళ్ళు తక్కువ. ఇది కండరాల మీద ప్రభావం చూపించే జబ్బు. మహిళలు ఎక్కువగా దీని బారిన పడతారు. అయితే ఈ సైటిస్ క్యాటగిరీలో కొన్ని రకాలున్నాయి. ఒక విభాగంలో విపరీతమైన నీరసం లాంటి లక్షణాలు ఉంటే, మరోదాంట్లో చర్మంపై దద్దుర్లు లాంటివి తలెత్తుతాయి. ఇంకోటైపులో మోచేయి మోకాలు తదితర ప్రాంతాల్లో విపరీతమైన నొప్పి ఉంటుంది. వీటిలో సమంతా దేన్నుంచి సఫరవుతుందో వివరించలేదు కానీ వీటిలో ఒకటన్నది మాత్రం వాస్తవమే
సరైన వైద్యం అందకపోతేనే ఇది ప్రాణాల మీదకు తెస్తుంది. అయితే సామ్ కు ఆ ఇబ్బంది లేదు. అత్యున్నత ఆసుపత్రికలో ట్రీట్మెంట్ తీసుకుంటుంది కాబట్టి స్పెషలిస్ట్ లు తనకేం చేస్తే త్వరగా నయమవుతుందో అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. కాకపోతే టైం మాత్రం అంత ఈజీగా చెప్పలేం. నెలల సమయం నిజమే. నవంబర్ 11 యశోద విడుదలయ్యాక వచ్చే ఏడాది ప్రారంభంలో శాకుంతలం రిలీజ్ ప్లాన్ చేశారు. బాలన్స్ షూట్ పూర్తయితే వేసవిలో ఖుషి థియేటర్లలో వస్తుంది. పూర్తిగా కోలుకున్నాక వెబ్ సిరీస్ లు మొదలవుతాయి. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా సెలబ్రిటీలు తన రికవరీకి విషెస్ చెబుతున్నారు
This post was last modified on October 30, 2022 2:08 pm
పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…
వైసీపీ తీరు మారలేదు. ఒకవైపు.. ఇండియా కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు ఆ పార్టీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు…
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…