వరల్డ్ వైడ్ సెన్సేషనల్ వసూళ్లతో దుమ్ము దులుపుతున్న కాంతార పుణ్యమాని మొన్నటి దాకా బయటవాళ్ళకు పెద్దగా పరిచయం లేని దర్శకుడు కం హీరో రిషబ్ శెట్టి ఏకంగా సూపర్ స్టార్ రజినీకాంత్ నుంచి ప్రత్యక్షంగా ప్రశంసలు అందుకునే రేంజ్ కు వెళ్ళాడు. తెలుగు రాష్ట్రాల్లో బ్రహ్మాండంగా ఆడుతుండటంతో ప్రత్యేకంగా రోడ్ మ్యాప్ వేసుకుని మరీ ఏపీ తెలంగాణ థియేటర్లలో ప్రేక్షకులను కలుసుకుంటున్నాడు. ఎక్కడికి వెళ్లినా క్లైమాక్స్ లో అతని పెర్ఫార్మన్స్ గురించి తప్ప మరో అంశం గురించి మాట్లాడితే ఒట్టు. అంతగా కనెక్ట్ అయిపోయిన కాంతారకు ముందు అనుకున్న హీరో వేరు.
ఈ రిషబ్ శెట్టి వెనుక పెద్ద కథే ఉంది. నానా కష్టాలు పడి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరి అనక కెమెరా సహాయకుడిగా మారి ఒక దర్శకుడి చేతిలో అవమానం పాలై ఇలా ఎన్నో అడ్డంకులు దాటుకున్న తర్వాతే ఈ స్థితికి వచ్చాడు. కాంతారను పెద్ద స్కేల్ లో నిర్మించాలని అనుకున్నప్పుడు హోంబాలే ఫిలింస్ తప్ప ఇంత బడ్జెట్ కు ఎవరూ న్యాయం చేయలేరని వాళ్ళను కలిశాడు. స్క్రిప్ట్ రాసుకున్న టైంలో రిషబ్ మనసులో ఉన్న హీరో పునీత్ రాజ్ కుమార్. ఫైనల్ వెర్షన్ పూర్తయ్యాక వెళ్లి వినిపించాడు. దేవుడు ఆవహించినట్టు రాశావని నువ్వే నటిస్తేనే దీనికి న్యాయం జరుగుతుందని చెప్పి రిషబ్ ని ఒప్పించింది పునీతే.
ఒకవేళ కన్నడ పవర్ స్టార్ ఇది చేసేందుకు ఒప్పుకుని ఉంటే ఫలితం ఇలాగే ఉండేదేమో కానీ రిషబ్ లోని అత్యద్భుతమైన యాక్టర్ ప్రపంచానికి తెలిసే వాడు కాదు. కానీ పునీత్ కు ఒక్క గొప్ప ల్యాండ్ మార్క్ మూవీ చివరి చిత్రంగా మిగిలిపోయేది. అయినా విధి రాత అలా ఉన్నప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు కానీ ఇప్పుడీ కాంతార ప్రభావం వల్ల రిషబ్ డైరెక్ట్ చేసిన గత చిత్రం సాహిప్రషాల కాసారగోడుతో పాటు ఇతను నటించిన గరుడగమన వృషభ వాహనలను తెలుగులో డబ్బింగ్ చేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. అంతే మరి హిట్టు పడితే ఎఫెక్ట్ ఇలాగే ఉంటుంది.
This post was last modified on October 30, 2022 11:52 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…