Movie News

అవతార్-2.. 3 గంటల 10 నిమిషాలు మరో లోకంలో

13 ఏళ్ల కిందట అవతార్ అనే సినిమా రేపిన సంచలనం గురించి ఎంత చెప్పినా తక్కువే. అప్పటిదాకా ఉన్న ప్రపంచ సినిమా రికార్డులన్నింటినీ అది భారీ తేడాతో బద్దలు కొట్టేసింది. చాలా ఏళ్ల పాటు ఆ రికార్డులు చెక్కు చెదరకుండా ఉండిపోయాయి.

గత దశాబ్ద కాలంలో ప్రపంచవ్యాప్తంగా హాలీవుడ్ సినిమాల రీచ్ బాగా పెరగడం, అలాగే టికెట్ల ధరల్లోనూ భారీ పెరుగుదల రావడంతో ‘అవతార్’ రికార్డులు బద్దలయ్యాయి కానీ.. అప్పటి లెక్కల్లో చూసుకుంటే ‘టైటానిక్’ వసూళ్ల రికార్డు అనితర సాధ్యం అనడంలో సందేహం లేదు.

అంతకుమించిన బాక్సాఫీస్ సంచలనం ‘అవతార్-2’తో చూస్తాం అనడంలో సందేహం లేదు. ‘ఎవెంజర్స్’ సహా అన్ని హాలీవుడ్ సినిమాల రికార్డులను బద్దలు కొట్టడానికి ఈ చిత్రం ఇంకో 50 రోజుల్లోనే రాబోతోంది ‘అవతార్-2’. డిసెంబరు 16న ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ పేరుతో జేమ్స్ కామెరూన్ సీక్వెల్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న సంగతి తెలిసిందే.

‘టైటానిక్’ తర్వాత ‘అవతార్’ను ప్రేక్షకుల ముందుకు తేవడానికి 12 ఏళ్లు సమయం తీసుకున్న కామెరూన్.. అవతార్ తర్వాత అవతార్-2ను సిద్ధం చేయడానికి 13 ఏళ్లు సమయం వెచ్చించాడు. దీన్ని బట్టే ఆయన ఈసారి ఎలాంటి అద్భుతాలను ఆవిష్కరించి ఉంటాడో అంచనా వేయొచ్చు. అవతార్ సిరీస్‌లో ఇంకో రెండు సినిమాలు కూడా అందించబోతున్న కామెరూన్.. ‘అవతార్-2’ను ఏ విధంగా మలిచి ఉంటాడో అన్న ఉత్కంఠ అంతకంతకూ పెరిగిపోతోంది.

ఈ సినిమాకు ఫస్ట్ కాపీ కూడా రెడీ చేసిన కామెరూన్.. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేయించే పనిలో పడ్డాడు. సినిమా నిడివి 3 గంటల 10 నిమిషాలన్న సంగతి తాజాగా వెల్లడైంది. మామూలుగా హాలీవుడ్ సినిమాలు గంటన్నర, రెండు గంటల నిడివిలో ఉంటాయి. కానీ ‘టైటానిక్’ చిత్రాన్ని 3 గంటల 15 నిమిషాల నిడివితో తీసి మెగా హిట్ చేసిన కామెరూన్.. ‘అవతార్’ను 2 గంటల 42 నిమిషాల రన్ టైంతో వదిలి ఇంకా పెద్ద హిట్ చేశాడు. ఇప్పుడు అవతార్-2తో 3 గంటల 10 నిమిషాల పాటు ప్రేక్షకులను మరో లోకంలోకి తీసుకెళ్లబోతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా 160 భాషల్లో ‘అవతార్-2’ను రిలీజ్ చేయబోతుండడం విశేషం.

This post was last modified on October 29, 2022 3:23 pm

Share
Show comments
Published by
Satya
Tags: Avatar

Recent Posts

మాస్ సినిమా లకు పోటీ ఇవ్వనున్న క్లాస్ మూవీ?

ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…

7 hours ago

సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న.. ఎవరి తప్పు లేదు : అల్లు అర్జున్‌

పుష్ప‌-2 సినిమా ప్రీరిలీజ్ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లోని సంధ్య థియేట‌ర్ వ‌ద్ద జ‌రిగిన తొక్కిస‌లాట‌ అనంత‌రం చోటు చేసుకున్న ప‌రిణామాల‌పై శ‌నివారం…

10 hours ago

కేజ్రీవాల్ మ‌రోసారి జైలుకేనా?

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌, ఢిల్లీ మాజీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌కు మ‌రో ఉచ్చు బిగుస్తోంది. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

11 hours ago

పెళ్లయినా.. కీర్తి తగ్గేదే లే!

కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…

11 hours ago

నిర్మ‌ల‌మ్మ ఎఫెక్ట్‌: ‘పాప్ కార్న్‌’పై ప‌న్ను పేలుడు!

కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ నేతృత్వంలోని జీఎస్టీ మండ‌లి స‌మావేశంలో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. కాల‌క్షేపానికి తినే…

12 hours ago