తెలుగు వారికి బాగా దగ్గరైన మలయాళ భామ నిత్యా మీనన్ శుక్రవారం పెట్టిన ఒక సోషల్ మీడియా పోస్టు పెద్ద చర్చకే దారి దాసింది. ఆమె ప్రెగ్నెన్సీ టెస్టింగ్ కిట్‌లో పాజిటివ్ చూపిస్తున్న ఫొటో పెట్టి ‘అండ్ ద వండర్ బిగిన్స్’ అంటూ క్యాప్షన్ జోడించింది. దీంతో ఆమె ఫాలోవర్లు ఒక్కసారిగా షాకైపోయారు.
ఇంకా నిత్యాకు పెళ్లే కాలేదు.. ఇప్పుడే ఆమె ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి అని ఆశ్చర్యపోయారు. నిత్యా ఓ మలయాళ నటుడితో ప్రేమలో ఉన్నట్లు వార్తలొచ్చాయి కానీ.. అతనెవ్వరన్నది వెల్లడి కాలేదు.
వీరి పెళ్లి గురించి కూడా ఈ మధ్య ఎలాంటి వార్తలు రాలేదు. అలాంటిది ఏకంగా ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేయడం ఏంటి అనుకున్నారు. కానీ అసలు విషయం కొన్ని గంటల తర్వాత కానీ బయటపడలేదు. ఈ అప్‌డేట్ నిత్యా వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కాదు. ఓ సినిమాకు సంబంధించిన ప్రచారంలో భాగంగా ఇచ్చింది.
ఎందుకంటే మరో మలయాళ నటి పార్వతి సైతం సేమ్ ఇలాంటి పోస్టే పెట్టింది. ఇలా ఒకేసారి ఇద్దరు హీరోయిన్లు ఒకేలా ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేయడం అన్నది జరగదు. ఇదంతా నిత్యా, పార్వతి కలిసి చేయబోతున్న ఒక సినిమాకు సంబంధించి ప్రచారంలో భాగంగా చేసిందట. ముందు ఈ నర్మగర్భమైన పోస్టులు పెట్టి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచాక.. సినిమా గురించి పూర్తి వివరాలు వెల్లడించబోతున్నారట.
పార్వతి మలయాళయేతర భాషల్లో అంతగా పాపులర్ కాదు కాబట్టి ఆమె పోస్టు గురించి జనాలకు ఆలస్యంగా తెలిసింది. ఈ లోపు నిత్యా పోస్టు మాత్రం వైరల్ అయిపోయింది. దీని గురించి పెద్ద చర్చ జరిగింది. కానీ అసలు విషయం తెలిశాక అందరూ కామ్ అయ్యారు. ఈ పోస్టును బట్టి చూస్తుంటే ఈ చిత్రం మహిళలు, ప్రెగ్నెన్సీ రిలేటెడ్ అని అర్థమవుతోంది. త్వరలోనే ఈ సినిమా గురించి పూర్తి వివరాలు తెలియబోతున్నాయి.
This post was last modified on October 29, 2022 1:12 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…