అందరి దృష్టి వచ్చే ఏడాది సంక్రాంతికి జరగబోయే బాక్సాఫీస్ యుద్ధం మీదే ఉంది కానీ అదే స్థాయిలో డిసెంబర్ 23 కూడా మెగా కాంపిటీషన్ కి రెడీ అవుతోంది. మాస్ మహారాజా ‘ధమాకా’ని ఆ డేట్ కి లాక్ చేస్తూ ఆల్రెడీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చేశారు. నిఖిల్ ’18 పేజెస్’ని అదే రోజుకి ఫిక్స్ చేశారు. రణ్వీర్ సింగ్ ‘సర్కస్’ ప్యాన్ ఇండియా రేంజ్ లో ముస్తాబవుతోంది దాని కోసమే. ఇప్పుడు తాజాగా విజయ్ సేతుపతి కత్రినా కైఫ్ ల ‘మెర్రి క్రిస్మస్’ని కూడా బరిలో దించబోతున్నారు. అందాధూన్ బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ అందిస్తున్న మరో థ్రిల్లర్ మూవీ ఇది. ఈ నాలుగు కన్ఫర్మ్ చేసేసుకున్నాయి.
ఇక్కడితో స్టోరీ అయిపోలేదు. సమంతా ‘శాకుంతలం’ కోసం గుణశేఖర్ అదే సీజన్ ని చూస్తున్నాడు. ఇంత రద్దీ మధ్యలో దింపితే నలిగిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి నిర్ణయం మార్చుకునే అవకాశం లేకపోలేదు. ఈ సినిమా మొత్తం సామ్ ఇమేజ్ మీదే మార్కెట్ చేయాలి కనక స్టార్ హీరోలతో క్లాష్ కావడం అంత సేఫ్ కాదు. ఒకవేళ ఇది వద్దనుకుంటే ఫిబ్రవరికి షిఫ్ట్ అవ్వడం తప్ప మరో మార్గం లేదు. రెండు రోజుల ముందు 21న ‘అన్నీ మంచి శకునములే’ రావొచ్చు. నందిని రెడ్డి దర్శకురాలు. ఎందుకు రిస్క్ అనుకుంటే అదే నెల 30కి వాయిదా వేసుకునే సూచనలున్నాయి.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే డిసెంబర్ పదహారునే రానున్న ‘అవతార్ 2’ని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎందుకంటే వారానికే నెమ్మదించే సీన్ ఉండదు కాబట్టి ఆపై వచ్చే వాటికి స్క్రీన్లను సర్దడం మల్టీప్లెక్సులకు సవాల్ గా మారుతుంది. అసలే దాని డిమాండ్ మాములుగా లేదు. ఈ లెక్కన పొంగల్ కు ఏ మాత్రం తీసిపోని రీతిలో బాక్సాఫీస్ రచ్చ చూడబోతున్నాం. పలు సందర్భాల్లో చెప్పుకున్నట్టు అయితే అతివృష్టి లేదా అనావృష్టి టాలీవుడ్ లో కొనసాగుతూనే ఉంది. నేనా నువ్వా అంటూ ఎవరూ వెనక్కు తగ్గేందుకు మొగ్గు చూపకపోవడం ఈ పరిస్థితికి దారి తీస్తోంది.
This post was last modified on October 29, 2022 10:31 am
ఇప్పటి ట్రెండ్ లో హీరోయిజం అంటే ఎంత హింస ఉంటే అంత కిక్కని భావిస్తున్నారు దర్శకులు. ఎమోషన్, యాక్షన్ కన్నా…
సంక్రాంతి పండక్కు అందరికంటే ముందు వస్తున్న ఆనందం, అడ్వాంటేజ్ రెండూ గేమ్ ఛేంజర్ కు అనుకూలంగా ఉంటాయి. టాక్ పాజిటివ్…
టాలీవుడ్‌లో సమస్యలు ఎదురైనప్పుడు.. వాటిని పరిష్కరించే వ్యూహాలు.. చతురత ఉన్న ప్రముఖుల కోసం.. ఇప్పుడు నటులు, నిర్మాతలు ఎదురు చూసే…
ఐఏఎస్ అధికారి.. శ్రీలక్ష్మి గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా తెలుసు. దీనికి కారణం .. దేశంలోనే…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు మరో బీసీ మంత్రాన్ని పఠిస్తున్నారు. వారికి ఇప్పటికే.. సరైన సముచిత ప్రాధాన్యం కల్పించిన…
‘పవర్’ లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయమైన బాబీ.. ఆ తర్వాత ‘సర్దార్ గబ్బర్ సింగ్’తో ఎదురు దెబ్బ…