చాలారోజుల నుండి బాలీవుడ్ కు కావాల్సిన హిట్ మాత్రం దొరకట్లేదు. ఓ రెండు వారాల క్రితం రిలీజైన అయుష్మాన్ ఖురానా ‘డాక్టర్ జి’ సినిమాకు మాంచి టాకే వచ్చింది కాని, కలక్షన్లు మాత్రం అంతంతమాత్రమే. ‘కాంతారా’ సినిమాకంటే ఎక్కువే వస్తున్నప్పటికీ, ఆ రేంజు కలక్షన్లు మాత్రం సరిపోవనే చెప్పాలి. సరే దివాళి సందర్భంగా వస్తున్న రెండు సినిమాలైనా కాపాడతాయ అనుకుంటే.. ఇప్పుడు అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ కూడా హ్యాండిచ్చినట్లే అనిపిస్తోంది.
‘రామ్ సేతు’ సినిమాతో విచ్చేశాడు సూపర్ స్టార్ అక్షయ్. సినిమా కంటెంట్ పరంగా హిందుత్వ టచ్ ఉండనే ఉంది కాని, సినిమాకు మాత్రం నెగెటివ్ రివ్యూలే వచ్చాయ్. దానితో భారీ కలక్షన్లు వచ్చే సీన్లేది చాలామంది ట్రేడ్ పండిట్స్ తేల్చిచెప్పేస్తున్నారు కూడా. ఇకపోతే అజయ్ దేవగన్ ‘థ్యాంక్ గాడ్’ అంటూ విచ్చేశాడు. ఇది ఒక తమిళ సినిమాకు అనఫీషియల్ రీమేక్ అనే చెప్పాలి. సినిమాలో సిద్దార్ధ్ మల్హోత్రా, రకుల్ ప్రీత్ పాత్రలు ఆకట్టుకున్నా కూడా, ఎందుకో ఈ సినిమాకు కూడా కావల్సినంత ఓపెనింగ్స్ మాత్రం రాలేదు. ఈ రెండు సినిమాల్లో ఒక్క పాట్ కూడా వైరల్ కాకపోవడం అందుకు ప్రధాన కారణం అని చెప్పొచ్చు. మనికే మతా హిగే సాంగుతో నోరా ఫతేహి ఆకట్టుకునే ప్రయత్నం చేసినా, ఆ పాట కోసం థ్యాంక్ గాడ్ ను ధియేటర్లలో చూస్తారా అనేదే సందేహం. ఒక విధంగా ఈ రెండు సినిమాలు కూడా బాలీవుడ్ ఆశల మీద నీళ్ళు చల్లినట్లే.
ఇక వచ్చే వారం తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ‘ఫోన్ బూత్’ సినిమాతో కత్రినా కైఫ్ దిగుతోంది. తనకంటే పదేళ్లు చిన్నోళ్లైన ఇషాన్ కట్టర్, సిద్దాంత్ చతుర్వేదిలతో ఈ సినిమాలో కత్రినా ఒక దెయ్యంగా కనిపిస్తూ రొమాన్స్ చంపేసిందని ట్రైలర్ చూస్తేనే అర్దమవుతోంది. దానికితోడు రిలీజైన పాటలన్నీ బాగానే ఎక్కేస్తున్నాయి. ఈ అంశాలన్నీ కలిసొచ్చి మొన్నామధ్యన కార్తీక్ ఆర్యన్ ఎలాగైతే బూల్ బులయ్యా 2 సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ కొట్టేశాడో.. ఇప్పుడు కత్రినా కూడా అలాంటి ఫీటే చేస్తే మాత్రం.. ఆమె కూడా మరో సూపర్ స్టార్ హీరోయిన్ అయిపోయినట్లే. ఫేం అయితే ఉంది కాని, అమ్మడికి సోలో బాక్సీఫీస్ హిట్లు మాత్రం లేవు. చూద్దాం బాలీవుడ్డు ఫేటును ఈ సెక్సీ దెయ్యం ఎలాంటి టర్నింగ్ తిప్పుతుందో.
This post was last modified on October 26, 2022 8:47 am
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…