Movie News

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం? ఈ చిత్రం అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయింది. ప్ర‌భాస్ ఫ్యాన్స్‌ను తీవ్ర నిరాశ‌కు గురి చేసిన ఈ మూవీ.. సామాన్య ప్రేక్ష‌కుల నుంచి కూడా ప్ర‌తికూల స్పంద‌నే తెచ్చుకుంది. సినిమా కాన్సెప్ట్ బాగున్నా.. ఎగ్జిక్యూష‌న్ బాలేద‌న్న‌ది మెజారిటీ ప్రేక్ష‌కుల మాట‌. చాలా వ‌ర‌కు అవ‌స‌రం లేని, బోరింగ్ స‌న్నివేశాల‌తో నింపేయ‌డం సినిమాకు మైన‌స్ అయింది. 

చివ‌రి 40 నిమిషాల సినిమా బాగున్నా.. అప్ప‌టి వ‌ర‌కు సినిమాను భ‌రించ‌డ‌మే ప్రేక్ష‌కుల‌కు క‌ష్ట‌మ‌వుతోంది. అద్భుత‌మైన స‌న్నివేశాలున్న‌ట్లుగా నిడివిని ఏకంగా 3 గంట‌లు దాటించేశారు. తీరా చూస్తే స‌గానికి స‌గం సీన్లు ప్రేక్ష‌కులకు బోర్ కొట్టించేశాయి. ఆ సీన్ల‌న్నింటినీ అలాగే ఉంచి.. ప్ర‌భాస్ ఓల్డ్ కింగ్ గెట‌ప్‌లో ఉన్న ఎపిసోడ్ మొత్తం లేపేసింది చిత్ర బృందం. ఇందుకు సాంకేతిక కార‌ణాలేవో చెప్పారు కానీ.. సినిమాలో ఆ సీన్లు లేక‌పోవ‌డం మాత్రం ప్ర‌భాస్ అభిమానుల‌కు తీవ్ర ఆగ్ర‌హం తెప్పించింది.

ఐతే ప్రిమియ‌ర్స్ నుంచే ఈ ఎపిసోడ్ మిస్ కావ‌డంపై తీవ్ర విమ‌ర్శ‌లు రావ‌డంతో టీం అప్ర‌మత్త‌మైంది. చ‌క‌చ‌కా ఆ ఎపిసోడ్‌ను రెడీ చేసి, ఆదివారం ఈవెనింగ్ షోల‌ను నుంచి సినిమాలో క‌లిపారు. దీని కోసం ద్వితీయార్ధంలో బొమ‌న్ ఇరానీ మీద తీసిన కొన్ని స‌న్నివేశాల‌ను లేపేశారు. త‌ద్వారా నిడివి అంత‌కుముందు ఉన్న‌ట్లే ఉంది. ఇక సాయంత్రం సినిమా చూసిన వాళ్లంద‌రూ సినిమాలో యాడ్ చేసిన ఎపిసోడ్ గురించి పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. సినిమా మొత్తానికి ఈ ఎపిసోడ్, అందులో వ‌చ్చే ఫైట్ హైలైట్ అని అంటున్నారు. 

ఇది క‌చ్చితంగా సినిమాలో ఉండాల్సిన ఎపిసోడ్ అని.. అస‌లు దీన్ని ఎలా ప‌క్క‌న పెట్టార‌న్న‌ది అర్థం కాని విష‌య‌మ‌ని అంటున్నారు. సినిమాను ప‌లుమార్లు వాయిదా వేసి, చాలా టైం తీసుకుని సంక్రాంతి బ‌రిలోకి వ‌చ్చిన టీం.. ఇంత కీల‌క‌మైన ఎపిసోడ్‌ను సినిమాలో యాడ్ చేయ‌లేక‌పోవ‌డం దారుణ‌మ‌ని.. ఇది సినిమాలో అవ‌స‌రం లేద‌ని అనుకుని ఉన్నా, సీక్వెల్ కోసం అట్టిపెట్టి ఉన్నా.. అది క్ష‌మార్హం కాని త‌ప్పు అంటున్నారు. ఐతే ఇప్ప‌టికే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయిన నేప‌థ్యంలో ఈ ఎపిసోడ్ వ‌ల్ల సినిమాకు ఎంత‌మేర ప్ర‌యోజ‌నం ఉంటుందో చూడాలి.

This post was last modified on January 12, 2026 9:52 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

9 minutes ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

15 minutes ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

46 minutes ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

2 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

5 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

9 hours ago