సినిమాలన్నాక డిజాస్టర్లు బ్లాక్ బస్టర్లు సహజమే కానీ ఒక్కోసారి వాటి ఫలితాల తాలూకు ప్రభావం చాలా కాలం వెంటాడుతుంది. ఈ మధ్య కాలంలో అలా విపరీతమైన చర్చకు గురైన చిత్రాలు లైగర్, ఆచార్య. నిర్మాణంలో భాగస్వాములైనందుకు ఆ దర్శకులే వాటిని భరించాల్సిన పరిస్థితి తలెత్తడం పెద్ద ఇష్యూ అయ్యింది. ఎప్పుడూ ఏదో ఒక సందర్భంలో నవ్వుతూ కనిపించే కొరటాల శివ నెలల తరబడి మాయమయ్యారంటే దానికి కారణం ఎన్టీఆర్ స్క్రిప్ట్ ఒకటే కాదన్న సంగతి తెలిసిందే. ఇక లైగర్ తాలూకు నీలినీడలు ఇంకా పూరి బృందాన్ని వెంటాడుతూనే ఉన్నట్టు తాజా పరిణామాలు గమనిస్తే అర్థం చేసుకోవచ్చు.
లైగర్ నష్టాల భర్తీ కోసం డిస్ట్రిబ్యూటర్లు పూరిని కలిసి చర్చించేందుకు రిజల్ట్ వచ్చినప్పటి నుంచి ట్రై చేస్తూనే ఉన్నారు. ఎక్కువగా ముంబైలోనే ఉంటున్న పూరి వీలైనంత తిరిగి ఇస్తాననే హామీ కూడా ఇచ్చినట్టు టాక్ వచ్చింది. కాకపోతే కొంత టైం అడిగారు. అది దగ్గర పడుతోంది. కానీ అంతకన్నా ముందే డబ్బులు కావాలని డిమాండ్ చేస్తున్న కొందరు పంపిణీదారులు సుమారు 50కి పైగా సమూహంగా ఏర్పడి ఆయన ఆఫీసర్ ముందు ధర్నా చేయాలని నిర్ణయించుకున్నారట. ఇది కాస్తా పూరికి తెలియడం ఓ ఫోన్ కాల్ లో దీని మీద సీరియస్ అయినట్టుగా వచ్చిన లీక్ హాట్ టాపిక్ గా మారింది.
తన పరువు తీయాలని చూస్తే భరించనని వాళ్లకు తప్ప మిగిలినవాళ్లకు నష్టపరిహారం ఇస్తానని అందులో ఉంది. అంతే కాదు పోకిరి నుంచి ఇస్మార్ట్ శంకర్ దాకా బయ్యర్లు ఉన్న బాకీలను సదరు అసోసియేషన్ ఇప్పిస్తుందాని నిలదీయడం కూడా వినిపించింది. తిరిగి ఇవ్వాలని రూల్ లేకపోయినా నష్టపోయారనే ఉద్దేశంతో ముందుకొస్తే ఇలా చేయడం పట్ల పూరి చాలా ఆవేదన చెందినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఈ బ్లాక్ మెయిల్ వ్యవహారం సోషల్ మీడియాకు సైతం పాకిపోయింది. అఫీషియల్ సోర్స్ నుంచి ఇదంతా బయటికి రాకపోయినా దీని మీద ఫిలిం నగర్ వర్గాల్లో పెద్ద డిబేటే జరుగుతోంది
This post was last modified on October 24, 2022 6:28 pm
ఇంకో పద్దెనిమిది రోజుల్లో హిట్ 3 ది థర్డ్ కేస్ విడుదల కానుంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని 2…
తెలుగు రాష్ట్రాలు సత్తా చాటుతున్నాయి. వృద్ధి రేటులో ఇప్పటికే గణనీయ వృద్ధిని సాధించిన తెలుగు రాష్ట్రాలు తాజాగా ద్రవ్యోల్బణం (Inflation)…
ఈమధ్య AI టెక్నాలజీతో హాట్ టాపిక్ గా నిలిచిన చైనా టారిఫ్ వార్ తో కూడా అమెరికాతో పోటీ పడడం…
తెలుగులో ఒకప్పుడు వెలుగు వెలిగిన నిర్మాతలు చాలామంది కనుమరుగైపోయారు. కానీ అల్లు అరవింద్, సురేష్ బాబు లాంటి కొద్ది మంది…
అగ్రరాజ్యం అమెరికా కొత్తగా సుంకాల పెంపు కారణంగా ఏపీలో ఆక్వా రంగంపై తీవ్ర ప్రభావం పడినా... కూటమి సర్కారు తీసుకున్న…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ తో కలిసి…