మాములుగా ఏదైనా కొత్త శుక్రవారం ఫ్రెష్ రిలీజులు ఉంటే అంతకు ముందు వచ్చినవి నెమ్మదించడం సర్వ సాధారణం. కానీ కాంతార మాత్రం ఈ విషయంలో తగ్గేదేలే అంటోంది. మొన్న ఏకంగా రెండు తమిళ డబ్బింగులు, రెండు తెలుగు స్ట్రెయిట్ సినిమాలు వచ్చినా కోళ నృత్య తాండవం మాత్రం ఆగడం లేదు. అనూహ్యంగా హైదరాబాద్ లాంటి చోట్ల ఈ వీకెండ్ అడ్వాన్స్ హౌస్ ఫుల్స్ పడటమే దానికి సాక్ష్యంగా చెప్పొచ్చు. కేవలం ఒక్క తెలుగు వెర్షన్ నుంచే ఎనిమిది రోజులకు గాను 12 కోట్ల 30 లక్షల దాకా షేర్ వచ్చినట్టు ట్రేడ్ రిపోర్ట్. అంటే గ్రాస్ 23 కోట్ల దాకా తేలుతుంది. ఇది మైండ్ బ్లోయింగ్ ఫిగర్.
యుఎస్ లో కెజిఎఫ్ తర్వాత 1 మిలియన్ మార్కు దాటిన శాండల్ వుడ్ మూవీగా కాంతార మరో రికార్డు సొంతం చేసుకుంది. ఎందరో కన్నడ సీనియర్ హీరోల వల్ల సాధ్యం కానీ ఫీట్ ని చాలా అలవోకగా అందుకుంది. హిందీ వెర్షన్ సైతం స్టడీగానే ఉంది. 25న విడుదల కాబోతున్న రామ్ సేతు, థాంక్ గాడ్ రెస్పాన్స్ ని బట్టి మళ్ళీ పెరగడమా తగ్గడమా ఆధారపడి ఉంటుంది. అన్ని భాషలు కలిపి కనీసం రెండు వందల కోట్ల గ్రాస్ ని ఈజీగా అందుకుంటుందనే ట్రేడ్ అంచనాలు నిజమయ్యే సూచనలు పుష్కలంగా ఉన్నాయి. వచ్చే వారం ఎలాగూ చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేకపోవడం కలిసి వస్తోంది.
కంటెంట్ ఉంటే ఎవరు నటించారనేది పట్టించుకోమని కాంతార రూపంలో మరోసారి స్పష్టమైన తీర్పు ఇచ్చిన ఆడియన్స్ రెగ్యులర్ కథలతో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించే దర్శక రచయితలకు పెద్ద పాఠమే నేర్పించారు. ముఖ్యంగా ఈ ఏడాదిలో వచ్చిన బిగ్గెస్ట్ హిట్స్ అన్నీ యూనీక్ కాన్సెప్ట్స్ తో వచ్చినవే. దీని దర్శకుడు కం హీరో రిషబ్ శెట్టి ప్రమోషన్లన్నీ పూర్తయ్యాక రెండు నెలలు విశ్రాంతి కోసం విదేశాలకు వెళ్ళిపోతున్నాడు. తర్వాత రుద్రప్రయాగ అనే మరో డిఫరెంట్ మూవీ ప్లాన్ చేశారట. కాంతార 2తో పాటు గీత ఆర్ట్స్ ప్రాజెక్టు ఎప్పుడుండొచ్చు లాంటి ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ఇంకా చాలా టైం పడుతుంది.
This post was last modified on October 23, 2022 1:48 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…