మొత్తానికి నందమూరి బాలకృష్ణ సినిమా ‘వీరసింహారెడ్డి’ విడుదల విషయంలో ఒక క్లారిటీ వచ్చేసింది. ముందు దసరాకు అనుకుని.. ఆ తర్వాత డిసెంబర్ రిలీజ్ మీద కన్నేసి.. చివరికి సంక్రాంతి విడుదలకు ఫిక్సయిపోయారు. ముందు నుంచి ప్రచారంలో ఉన్న ‘వీరసింహారెడ్డి’ టైటిల్‌నే సినిమాకు ఖాయం చేసిన చిత్ర బృందం.. సంక్రాంతికి తమ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
ఇప్పటిదాకా ఎవరూ చేయని విధంగా కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర ‘వీరసింహారెడ్డి’ టైటిల్ లాంచ్ కార్యక్రమాన్ని ఘనంగా చేసింది చిత్ర బృందం. ఈ సందర్భంగా దర్శకుడు గోపీచంద్ మలినేని సినిమా గురించి ఇచ్చిన ఎలివేషన్ బాలయ్య అభిమానులకు పూనకాలు తెప్పించేసింది. అతను సిినమా మీద మామూలు కాన్ఫిడెన్స్‌తో లేడని ఈ మాటల్ని బట్టి అర్థమవుతోంది.
“ఇంకా ఇరవై రోజులు షూటింగ్ ఉన్నా సరే.. ఇప్పటికిప్పుడు సినిమా రిలీజ్ అయినా కానీ.. బ్లాక్‌బస్టర్ అవుతుంది. అంత కంటెంట్ ఉంది సినిమాలో” అంటూ ‘వీరసింహారెడ్డి’కి ఎలివేషన్ ఇచ్చాడు గోపీచంద్. అంతేకాక తన లాంటి వీరాభిమాని బాలయ్యతో సినిమా తీస్తే ఎలా ఉంటుందో చూస్తారు అంటూ మరో కామెంట్ కూడా చేశాడు. “ఒక సమరసింహారెడ్డి సినిమా చూసిన ఫ్యాన్.. సినిమా రిలీజ్ రోజు మొత్తం జైల్లో ఉన్న ఒక అభిమాని సినిమా తీస్తే ఎలా ఉంటుందో అదే.. వీరసింహారెడ్డి. మన ఫ్యాన్స్ అందరూ పండగ చేసుకునేలా ఉంటుందీ సినిమా” అని గోపీచంద్ అన్నాడు.
తాను బాలయ్యకు వీరాభిమాని అని.. ఆయనతో సినిమా చేసే అవకాశాన్ని ఒక బాధ్యతగా భావించి అభిమానులు గర్వించే చిత్రాన్ని అందిస్తానని ఈ సినిమా ప్రారంభోత్సవం టైంలోనే చెప్పాడు గోపీచంద్. సినిమా చివరి దశలో ఉండగా గోపీచంద్ ఎలివేషన్ చూస్తుంటే అభిమానులకు ఈ సినిమా పెద్ద ట్రీట్ అని అర్థమవుతోంది.
This post was last modified on October 22, 2022 7:37 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…