మంచు విష్ణు కెరీర్లో హిట్లన్నీ చాలా వరకు కామెడీ ఎంటర్టైనర్లే. అతడికి తొలి విజయాన్నందించిన ఢీ.. ఆ తర్వాత సక్సెస్ అయిన దేనికైనా రెడీ, దూసుకెళ్తా.. ప్రేక్షకులకు మంచి వినోదాన్నందించాయి. కానీ ఆ తర్వాత అతను రకరకాల జానర్లలో సినిమాలు చేశాడు. అవి తేడా కొట్టాయి. ఇప్పుడు మళ్లీ తనకు అచ్చొచ్చిన కామెడీ జానర్లో జిన్నా చేశాడు. మధ్యలో అనవసరంగా వేరే జానర్లలో సినిమాలు చేసి ఇబ్బంది పడ్డానని.. ఇకపై ఆ తప్పు చేయనని మంచు విష్ణు అంటున్నాడు.
జిన్నా ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసిన మంచు విష్ణు.. తన సినిమాల ఎంపిక, జిన్నా విశేషాల గురించి ఇంకా ఏం చెప్పాడంటే.. నేను ఇప్పుడు రెండు విషయాలు దృష్టిలో పెట్టుకుని సిినిమాలు చేస్తున్నా. మా అమ్మన్నీ, పిల్లల్నీ తీసుకెళ్లి సినిమా చూడగలిగేలా ఉండాలి. విపరీతంగా నవ్వుకోవాలి. ఆ రెండు లక్షణాలున్న కథలతోనే నా ప్రయాణం. జిన్నా సరిగ్గా అలాంటి సినిమానే.
ఈ సినిమా కథను మొదటిసారి నాకు చెప్పినపుడు కోన వెంకట్ గారు హీరో పాత్ర పేరు గాలి నాగేశ్వరరావు అని చెప్పగానే కనెక్ట్ అయ్యాను. అతను అప్పు చేసి టెంట్ హౌస్ పెడతాడు. ఐతే అతను ఏ పెళ్లికి టెంట్ హౌస్ సామాన్లు అద్దెకు ఇచ్చినా ఆ పెళ్ళి ఆగిపోతుంటుంది. దీంతో అతడి అప్పులు మరింత పెరిగి ఇబ్బంది పడుతుంటాడు.
ఇలాంటి జిన్నా జీవితం మధ్యలో అనుకోని మలుపు తిరుగుతుంది. ఆ మలుపు కథలో నేను చెప్పిన మార్పు ప్రకారం వచ్చేదే. ఇంటర్వెల్లో ప్రేక్షకులు కచ్చితంగా సర్ప్రైజ్ అవుతారు. లేదా షాకవుతారు. అదేంటన్నది తెర మీదే చూడాలి. ఈ సినిమా టైటిల్ విషయంలో కొన్ని వివాదాలు నడిచాయి. మాకు చెడు ఉద్దేశం ఏమీ లేదు కాబట్టి వాటిని పట్టించుకోం. నేను మాట్లాడినా వివాదమే. మాట్లాడకపోయినా వివాదమే. అందుకే నా పని నేను చూసుకుంటున్నా.. అని మంచు విష్ణు తెలిపాడు.
This post was last modified on October 20, 2022 1:02 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…