ప్రస్తుతం తెలుగు సినిమాలేవీ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్ళు అందుకోలేకపోతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ బాగానే ఉందనే టాక్ అందుకున్నప్పటికీ మూడు నాలుగు రోజులకే డ్రాప్ అవుతూ వచ్చింది. వర్షాల ఎఫెక్ట్ కూడా ఆ సినిమా కలెక్షన్స్ పై పడింది. అయితే ఓ మోస్తారు కలెక్షన్స్ తో మెల్లగా బండి లాగిస్తున్న తరుణంలో చిరు బావ అల్లు అరవింద్ గాడ్ ఫాదర్ కి టఫ్ ఇచ్చాడు.
కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకున్న రిషబ్ శెట్టి ‘కాంతార’ ను అల్లు అరవింద్ తెలుగులో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. కాంతార సినిమా రావడంతో ఒక్కసారిగా గాడ్ ఫాదర్ కలెక్షన్స్ బాగా డ్రాప్ అయ్యాయి. ఏదో మెల్లగా ఓ మోస్తారు కలెక్షన్స్ తో ముందుకు సాగుతున్న గాడ్ ఫాదర్ కి కాంతార ఉన్నపళంగా చెక్ పెట్టేసింది.
సినిమా టాక్ రోజు రోజుకి స్ప్రెడ్ అవుతుండటంతో కలెక్షన్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. తెలుగు స్టేట్స్ లో ఇప్పటికే 8 కోట్లకు పైగా షేర్ సాదించింది కాంతార.
రిషబ్ శెట్టి నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ డబ్బింగ్ సినిమాకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
ముఖ్యంగా క్లైమాక్స్ తో రిషబ్ ఆడియన్స్ ను కట్టిపరేసి మెస్మరైజ్ చేయడంతో సినిమా భారీ వసూళ్ళు అందుకుంటుంది. వచ్చే వీకెండ్ కూడా ఈ సినిమా తెలుగులో మంచి కలెక్షన్స్ రాబట్టే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే దీపావళి సినిమాలపై కూడా కాంతార ఎఫెక్ట్ గట్టిగా పడనుంది. మరి ‘కాంతార ‘ ఫైనల్ రన్ ఎంత వరకూ కొనసాగుతుందో చూడాలి.
This post was last modified on October 19, 2022 10:41 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…