Movie News

టాలీవుడ్: పంచుకుంటారా? పాడుచేసుకుంటారా?

బీభత్సమైన టాక్ వచ్చినా కూడా కలక్షన్లు రావట్లేదు. ప్రస్తుతం టాలీవుడ్ బక్సాఫీస్ పరిస్థితి ఇదే. గాడ్ ఫాదర్ సినిమాకు మూడో వారంలో అసలు కలక్షన్లు నిల్ అయిపోయాయ్. కొత్తగా రిలీజైన కన్నడ సినిమా కాంతారాకు తప్పిస్తే, ఇతర తెలుగు సినిమాలైన బాయ్‌ ఫ్రెండ్ ఫర్ హైర్, క్రేజీ ఫెలోకు ఓపెనింగ్సే లేవు. అయినాసరే ఈ వచ్చే శుక్రవారం మాత్రం.. తెలుగులో ఏకంగా నాలుగు పాపులర్ సినిమాలు విడుదలవుతున్నాయ్. ఒక ప్రక్కన ఆడియన్స్ ఏ ట్రెండ్ ఫాలో అవుతున్నారో అర్ధంకాని రోజుల్లో.. ఈ నాలుగు సినిమాలూ బాక్సాఫీస్ దగ్గర కలక్షన్లు పంచుకుంటాయా? లేదంటే పాడుచేసుకుంటాయా?

విశ్వక్సేన్ నటించిన ‘ఓరి దేవుడా’ సినిమా అన్నింటికంటే ఎక్సపెక్టేషన్స్ విషయంలో టాప్ లో ఉంది. ఆ తరువాత మంచు విష్ణు నటించిన ‘జిన్నా’ సినిమాకు క్రేజ్ బాగుంది. ఇవి రెండూ కాకుండా తమిళ్ డబ్బడ్ సినిమాలైన శివకార్తికేయన్ ప్రిన్స్ అలాగే కార్తి సర్ధార్ కూడా రిలీజవుతున్నాయి. నిజానికి సోమవారం దివాళి హాలిడే కావడంతో.. లాంగ్ వీకెండ్ కలిసొస్తుందని మనోళ్ళు సినిమాలను ఇలా క్యూ కట్టించేశారు. కాకపోతే అందరూ ప్రమోషన్లు చేయడానికి గట్టిగానే కష్టపడుతున్నారు కాని, అసలు ఎవ్వరికీ పెద్ద క్రేజ్ మాత్రం రాలేదు. ఈ సమయంలో వీళ్ళకి విపరీతమైన పాజిటివ్ టాక్ చాలా అవసరం. సినిమాకు ఫస్ట్ డే ఫస్ట్ షో పడగానే టాక్ వస్తేనే ఈ సినిమాల్లో దేనికైనా కలక్షన్లు వచ్చేది.

ఆల్రెడీ ఒక ప్రక్కన మెగాస్టార్ గాడ్ ఫాదర్ మరో ప్రక్కన కన్నడ సినిమా కాంతారా ఉండనే ఉన్నాయ్. పైగా కాంతారా సినిమాకు మాస్ ఫాలోయింగ్ మామూలుగా లేదు. నిజానికి ఈ టైములో ఈ సినిమాలన్నీ ఒక్కొక్కటిగా వస్తే మాత్రం కలక్షన్లపరంగా బాగానే దంచుకునేవే. కాని అందరూ ఒకేసారి రావడం వలన.. హిట్ టాక్ వచ్చినా కూడా వసూళ్ళకు కాస్త డ్యామేజ్ అయితే జరిగే ఛాన్సుంది. పైగా రిలీజవ్వగానే సినిమా ఏ ప్లాట్ఫామ్ లో వస్తోంది తెలిసిపోతోంది కాబట్టి, దిల్ రాజు ఎన్ని చెప్పినా కూడా అందరూ రెండువారాల్లో సినిమాలను ఓటిటిలకు ఇచ్చేస్తున్నారు కాబట్టి, నెట్లో వచ్చాక చూద్దాంలే అని చాలామంది డ్రాప్ అయ్యే ఛాన్సు కూడా ఉంటుంది.

This post was last modified on October 18, 2022 3:37 pm

Share
Show comments

Recent Posts

బైడెన్ వ‌ర్సెస్ ట్రంప్‌.. న‌లిగిపోతున్న విదేశీయులు!

అగ్ర‌రాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న ప‌రిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణుల‌ను ఇర‌కాటంలోకి నెడుతున్నాయి. మ‌రో రెండు మూడు వారాల్లోనే…

7 hours ago

ఆ ఖైదీ జైలు శిక్ష‌ ఫిఫ్టీ-ఫిఫ్టీ.. భార‌త్‌, బ్రిట‌న్ ఒప్పందం!

జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చ‌ర్యం అంద‌రికీ క‌లుగుతుంది. కానీ, ఇది వాస్త‌వం. దీనికి సంబంధించి…

9 hours ago

‘టీడీపీ త‌లుపులు తెరిస్తే.. వైసీపీ ఖాళీ’

ఏపీలో రాజ‌కీయ వ్యూహాలు, ప్ర‌తివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయ‌కులు చేస్తున్న వ్యాఖ్య‌లు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్ప‌టికే…

9 hours ago

18 ఏళ్ల త‌ర్వాత‌ ప‌రిటాల ర‌వి హ‌త్య కేసులో బెయిల్

టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి ప‌రిటాల ర‌వి గురించి యావ‌త్ ఉమ్మ‌డి రాష్ట్రానికి తెలిసిందే. అన్న‌గారు ఎన్టీఆర్ పిలుపుతో…

11 hours ago

మహేష్ ఫ్యాన్స్ ఓన్ చేసుకున్నారు.. జర భద్రం!

క్రిస్మస్‌కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…

12 hours ago