Movie News

ప్రభాస్ కోసం 13 ఏళ్ల ముందే..

నాని ఇంకా స్టార్ కాకముందు అతను కథానాయకుడిగా ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ అనే చిన్న సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు నాగ్ అశ్విన్. దాని తర్వాత అతను చేసింది ఒకే సినిమా. కానీ అంతలోనే ‘బాహుబలి’తో ఆల్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్‌తో సినిమా చేసే అవకాశం పట్టేశాడు.

అతడి రెండో సినిమా ‘మహానటి’ అంత మంచి గుర్తింపునిచ్చింది మరి. గురువు శేఖర్ కమ్ముల లాగా చిన్న, మీడియం రేంజి హీరోలతో క్లాస్ సినిమాలేవో చేసుకుంటాడనుకుంటే.. ఇలా ప్రభాస్ లాంటి పెద్ద మాస్ హీరోతో అతను సినిమా చేస్తాడని ఎవరూ ఊహించలేదు. ఐతే ‘మహానటి’ తర్వాత అనుకోకుండా కథ రాసి ప్రభాస్‌ను మెప్పించి.. అశ్వినీదత్‌ను ఒప్పించి ఈ సినిమా చేస్తున్నాడని అంతా అనుకుంటున్నారు. కానీ ఈ సినిమా కోసం అతను 13 ఏళ్లుగా నిరీక్షిస్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించడం విశేషం.

తాను దర్శకుడు కావాలని నిర్ణయించుకున్నాక.. 2006-07 మధ్య ప్రభాస్ కోసం ఓ కథ రాసినట్లు అశ్విన్ వెల్లడించాడు. ఇప్పుడు అదే కథకు మెరుగులు దిద్ది ప్రభాస్‌తో సినిమా చేయబోతున్నట్లు చెప్పాడు. 13 ఏళ్ల కిందట అంటే అప్పటికి అశ్విన్‌కు మహా అయితే 20 ఏళ్లుంటాయేమో. సినీ రంగంలో పెద్దగా అనుభవం కూడా లేదు. మరి అప్పటికే ప్రభాస్‌ను దృష్టిలో ఉంచుకుని కథ రాయడం.. ఇప్పటికీ అది ట్రెండీగా ఉండటం.. అంతర్జాతీయ స్థాయిలో, వందల కోట్ల బడ్జెట్‌తో ఆ సినిమాను తెరకెక్కించబోతుండటం ఆశ్చర్యం కలిగించే విషయమే.

చిత్ర వర్గాల సమాచారం ప్రకారం ఇది ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్ కలగలిసిన చందమామ కథలా ఉంటుందని చెబుతున్నారు. తమ సంస్థ చరిత్రలోనే బిగ్గెస్ట్ ఫిలిం అని.. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అత్యంత భారీ బడ్జెట్లో తెరకెక్కబోతున్న చిత్రాల్లో ఒకటని ఈ సినిమా గురించి అశ్వినీదత్ ఓ సందర్భంలో అన్నారు. వచ్చే ఏడాది సెట్స్ మీదికి వెళ్లనున్న ఈ సినిమా 2022లో రిలీజయ్యే అవకాశాలున్నాయి.

This post was last modified on July 10, 2020 11:16 am

Share

Recent Posts

ఆలస్యం ‘ఆదర్శం’ కాకుంటే చాలు

ఫిలిం నగర్ వర్గాల్లో కొత్త ప్రచారం వెంకటేష్ అభిమానులను టెన్షన్ కు గురి చేస్తోంది. అక్టోబర్ 2 నుంచి ఆల్రెడీ…

2 hours ago

బీఆర్ఎస్‌కు క‌ష్ట కాల‌మా… న‌ష్ట కాల‌మా?!

దానం నాగేంద‌ర్‌పై వేటు ప‌డ‌డం.. ఖైర‌తాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావ‌డం.. ఇటీవ‌ల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…

7 hours ago

నాని న‌న్ను భ‌రించాల్సిందే… వేరే దారి లేదు – ఓదెల‌

శ్రీకాంత్ ఓదెల‌.. ఈ పేరు చెప్ప‌గానే అంద‌రికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…

9 hours ago

నానిని వీళ్లు పట్టుకున్నారు… వాళ్లు వదిలేశారు

నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…

9 hours ago

ప్యారడైజ్ మీటింగులో పదనిసలు

నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…

11 hours ago

ట్రబుల్ బృందానికి టైమ్ కలిసి వస్తోంది

వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…

12 hours ago