అక్టోబర్ 23 వస్తోంది. బాహుబలి ప్రభాస్ పుట్టినరోజు కాబట్టి ఫ్యాన్స్ అందరూ చాలా ఎక్సయిటింగ్ గా బర్తడే పోస్టర్ల కోసం వెయిట్ చేస్తుంటారు. అయితే ఈసారిమాత్రం.. ప్రభాస్ తన అభిమానులకు షాకివ్వబోతున్నాడు. ఎందుకంటే వారు వద్దంటూ ఎంత గొంతుచించుకున్నా కూడా ప్రభాస్ మాత్రం తను అనుకున్నదే చేస్తానన్నట్లు దర్శకుడు మారుతితో సినిమా చేస్తున్నాడు. పైగా ఈ సినిమా ఫస్ట్ లుక్ తప్పకుండా 23న వస్తున్నట్లు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇట్టే అర్ధమవుతోంది.
బుధవారం నుండి మారుతి సినిమా షూటింగ్ మొదలపెడుతున్నాడు ప్రభాస్. అయితే అంతకంటే ముందే మనోడు ఒక ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ తో ఒక ఫోటో షూట్లో పాల్గొన్నాడు. ఇది ప్రభాస్ తో మారుతి తీస్తున్న ‘రాజా డీలక్స్’ సినిమాకోసం చేసిన ఫోటో షూట్ అంటూ ఇప్పుడు ఫిలింనగర్లో వార్తలు వేడివేడిగా చెక్కర్లు కొడుతున్నాయ్. 23న ఫస్ట్ లుక్ పోస్టర్ డిజైన్ రిలీజ్ చెయ్యాలి కాబట్టి, అందుకోసమే ముందు ఫోటో షూట్ చేశారని అంటున్నారు. ఆల్రెడీ ఈ షూట్లో ఇద్దరు హీరోయిన్స్.. మాళవికా మోహనన్ అలాగే నిధి అగర్వాల్ కూడా పాల్గొన్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనిబట్టి చూస్తే.. ఒక్కసారి మారుతి చెప్పిన కథ నచ్చిన తరువాత.. అసలు ప్రభాస్ ను ఎవ్వరూ ఆపలేరని అర్దమవుతోంది. ఎవ్వరి మాటా పట్టించుకోకుండా ప్రభాస్ కూడా ఈ చిన్న సినిమా కోసం డేట్లు కూడా కేటాయించేసి పని మొదలెట్టేశాడు.
ఒక ప్రక్కన రాధేశ్యామ్ ఫ్లాప్ అవ్వడం, మరో ప్రక్కన ఆదిపురుష్ టీజర్ గ్రాఫిక్స్ నాసిరకంగా ఉండటంతో ఆల్రెడీ ప్రభాస్ ఫ్యాన్స్ చాలా డిజప్పాయింట్ అయ్యారు. అందుకే మారుతితో సినిమా అనగానే వాళ్ళు ఇంకా అప్సెట్ అయిపోతున్నారు. ఎందుకంటే రొటీన్ కథలతో పక్కా కమర్షియల్ అంటూ పక్కా రొటీన్ సినిమాలను తీయడం ఈయనకు అలవాటైపోయిందనేది వారి వాదన. మరి ప్రభాస్ ను ఎంత కొత్తగా చూపిస్తే మారుతికి అంత పేరొస్తుంది. అలాగే చాలాకాలం నుండి ఆయనకు దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్న హిట్టు కూడా ఆయన పాకెట్లోకి వచ్చి పడుతుంది. చూద్దాం ఏమవుతుందో!
This post was last modified on October 18, 2022 2:16 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…