అసలు ఏ స్టార్ బాక్సాఫీస్ రేంజ్ ఎంత అంటే.. ఒక స్టార్ ఫ్లాప్ సినిమాకు ఎంత కలక్షన్లు వస్తాయో అదే ఆ స్టార్ రేంజ్ అని ఒకప్పుడు చెప్పేవారు. మన పెద్ద పెద్ద స్టార్ల ఫ్లాప్ సినిమాలకు కూడా ₹40 కోట్ల షేర్ కలక్షన్లు వచ్చేవి. సో అదే వాళ్ళ రేంజ్. అయితే ఇప్పుడు మాత్రం ఆ పప్పులు ఉడకట్లేదు. ఎంతపెద్ద స్టార్ సినిమా అయినా కూడా ఫ్లాప్ అంటే మాత్రం అడ్రస్ కనిపించకుండా ధియేటర్ నుండి లేచిపోతోంది. ఈ సమయంలో అసలు స్టార్ హీరోయిన్ సమంత రేంజ్ ఎంత అనేది చూడాలని చాలామంది ఉవ్విళ్లూరుతున్నారు.
నిజానికి సమంతకు సోలోగా ఆడిన సినిమాలు చాలా తక్కువే. కాకపోతే స్టార్ హీరోయిన్ గా ఇమేజ్ వచ్చేశాక మాత్రం.. ఆమె చేసిన మజిలీ, ఓహ్ బేబీ వంటి సినిమాలు భారీగా ఆడేశాయి. కాని తరువాత డైవర్స్ ఎపిసోడ్ తో అమ్మడి చుట్టూ బాగా నెగెటివిటీ అల్లుకుంది. ఆ టైములో కరక్టుగా ‘పుష్ప’ సినిమా కోసం అమ్మడు విపరీతమైన హాటుగా కనిపిస్తూ ఒక ఐటెం సాంగ్ చేసేసింది. దానితో అమ్మడి లెవెల్ ఎక్కడికో వెళ్ళింది. మరి ఆ పాపులార్టీ అంతా గ్లామర్ డోస్ వల్లనే వచ్చిందా లేదంటే సమంతకు నయనతార లెవెల్లో సూపర్ స్టార్డమ్ వచ్చిందా తెలియాలంటే మాత్రం.. మనం 11-11-22 వరకు ఆగాల్సిందే. ఆ రోజు ‘యశోద’ సినిమా రిలీజవుతున్నట్లు తెలుస్తోంది.
క్రైమ్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపొందిన ‘యశోద’ సినిమా టీజర్ ఆల్రెడీ రిలీజ్ చేశారు. ఒక ప్రెగ్నెంట్ లేడీ కథగా ఈ సినిమారానుంది. అంటే గ్లామర్ అనే అంశానికి ఎటువంటి చోటూ లేదు. ఆల్రెడీ సినిమాను 8 కోట్ల టేబుల్ ప్రాఫిట్ కు అమ్మేశారని టాక్ ఉండనే ఉంది కాని, సినిమా సక్సెస్ అయ్యిందని చెప్పడానికి అది ఎటువంటి కొలమానం కాదు. ధియేటర్లలో సినిమా ఆడాలి, మాంచి రివ్యూస్ రావాలి, కలక్షన్లు రావాలి.. అప్పుడే సినిమా హిట్ కొట్టినట్లు. లేదంటే సినిమాకు యావరేజ్ టాక్ వచ్చేసినా కూడా కలక్షన్లు భయంకరంగా వచ్చేయాలి. అప్పుడే సమంత స్టార్డమ్ ఏంటో ప్రూవ్ అయ్యేది. మరి చూద్దాం ఏమవుతుందో!
This post was last modified on October 18, 2022 2:02 pm
వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…