విజయ్ దేవరకొండ స్పీడుకు ‘డియర్ కామ్రేడ్’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాలు గట్టి బ్రేకే వేశాయి. ‘డియర్ కామ్రేడ్’ విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో విజయ్ క్రేజ్ మామూలుగా లేదు. పెద్ద పెద్ద దర్శకులతో అతను పని చేయబోతున్నట్లు సంకేతాలు కనిపించాయి. అతడి మీద రూ.50 కోట్ల దాకా బడ్జెట్ పెట్టేంత రేంజ్ కనిపించింది.
‘హీరో’ సినిమాను ఆ టార్గెట్‌తోనే మొదలుపెట్టారు. కానీ ‘డియర్ కామ్రేడ్’ ఫ్లాప్ కావడం, ‘హీరో’ చిత్రీకరణ సాగినంత వరకు ఔట్ పుట్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో దాన్ని పక్కన పెట్టేశారు. ఆ చిత్రాన్ని పున:ప్రారంభిస్తారన్నారు కానీ.. అలాంటి సంకేతాలేమీ ఇప్పుడు కనిపించడం లేదు. దాని సంగతి తేల్చకుండానే పూరి జగన్నాథ్‌తో ‘ఫైటర్’ చిత్రాన్ని మొదలుపెట్టాడు విజయ్. కరోనా ఎఫెక్ట్‌తో దానికి బ్రేక్ పడింది కానీ.. లేకుంటే ఈ పాటికి సినిమా పూర్తి కావచ్చేదేమో.
మళ్లీ ఎప్పుడు షూటింగ్ మొదలైనా కూడా పూరి స్పీడుకి రెండు నెలల్లో సినిమా అయిపోతుందని భావిస్తున్నారు. మరి తర్వాత విజయ్ చేసే సినిమా ఏది అనే విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. ఇంతకుముందు అనుకున్న కొన్ని కాంబినేషన్లు వర్కవుటయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ‘హీరో’ పున:ప్రారంభమయ్యే అవకాశమూ లేదు.
ఐతే ఎప్పట్నుంచో విజయ్‌తో సినిమా తీయాలనుకుంటున్న దిల్ రాజుకు తన తర్వాతి చిత్రాన్ని విజయ్ చేయడం ఖాయమంటున్నారు. శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడట. ఈ కాంబినేషన్ గురించి ఇంతకుముందే వార్తలొచ్చాయి కానీ.. ఏదీ ఖరారవ్వలేదు. ఈ మధ్యే విజయ్, రాజు, శివ కలిసి సినిమా చేయడానికి అంగీకారం కుదిరిందట. ప్రస్తుతం శివ.. నానితో ‘టక్ జగదీష్’ సినిమా చేస్తున్నాడు. విజయ్ ‘ఫైటర్’ పూర్తి చేశాక కొంచెం గ్యాప్ తీసుకుని శివతో సినిమాను మొదలు పెడతాడని సమాచారం.
This post was last modified on April 22, 2020 1:47 pm
సహజంగా మూడు ఋతువులు వుంటాయి. నాలుగు నెలలు శీతాకాలం, నాలుగు నెలలు వేసవి కాలం, మరో నాలుగు నెలలు వర్షా…
ఒక్క ఫ్లాప్ కొందరు స్టార్ డైరెక్టర్ల ప్లానింగ్ ని ఎంత ప్రభావితం చేస్తుందో చెప్పడానికి లోకేష్ కనగరాజ్ ఉదాహరణ చాలు.…
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత అక్రమాస్తుల కేసులో ఈడీ స్పీడ్ పెంచడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఉన్నట్టుండి…
మన టాలీవుడ్ స్టార్లు ఇప్పుడు లోకల్ మార్కెట్ ను దాటేసి అంతకుమించి అనేలా అడుగులు వేస్తున్నారు. నార్త్ ఆడియన్స్ తో…
యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం నుంచి ఒక టైంలో వచ్చిన సినిమాలు చూస్తే.. తన పనైపోయిందనే అనిపించింది. ఐతే కెరీర్…
గత రెండు రోజులుగా ఇటు సోషల్ మీడియాలోను, అటు ప్రధాన మీడియా ఛానెళ్లలోను.. తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం.. ప్రపంచ…