గాడ్ ఫాదర్ ఎంత పెద్ద హిట్ అని చెప్పుకున్నా, నిర్మాత స్వంతంగా రిలీజ్ చేసుకున్నాం కాబట్టి ఎలాంటి నష్టాలు లేవని మీడియా ముందు నొక్కి వక్కాణించినా మొదటి నాలుగైదు రోజులు కనిపించిన హడావిడి ఆ తర్వాత థియేటర్ల వద్ద లేదన్నది నిజం . కొన్ని మెయిన్ సెంటర్లు మినహాయించి దాదాపు అన్ని చోట్ల షేర్లు అమాంతం పడిపోయాయి. ఇది ఊహించని బయ్యర్లు చాలా థియేటర్లకు అగ్రిమెంట్లను పది రోజుల దాకా మొదట్లోనే రెన్యూవల్ చేసుకున్నారు. తీరా చూస్తే ఇప్పుడీ షాక్. మెగాస్టార్ స్టామినా ఇది కాదు. ఈ రేంజ్ లో పాజిటివ్ టాక్ వస్తే కనీసం మూడు వారాల దాకా బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్ బ్యాటింగ్ ఉండాల్సిందే.
కానీ వాస్తవానికి జరుగుతున్నది వేరు. ఆచార్య బెనిఫిట్ షోలకే జనం రాలేదు. సరే అదంటే బొమ్మ మరీ అన్యాయంగా ఉంది కాబట్టి డిజాస్టర్ అయ్యిందని సర్దిచెప్పొచ్చు. కానీ అన్నీ సానుకూలంగా కనిపించిన గాడ్ ఫాదర్ ఉన్నట్టుండి ఇంత తీవ్ర స్థాయిలో నెమ్మదించడం మాత్రం ఆందోళన కలిగించే అంశం. సోషల్ మీడియాలోనూ మొదటి ఆదివారం దాకా కలెక్షన్లను ట్రాక్ చేసి మరీ షేర్ చేసుకున్న అభిమానులు ఆ తర్వాత ఉన్నట్టుండి సైలెంట్ అయ్యారు. దీన్ని బట్టే వాస్తవంగా జరుగుతున్నదేంటో అర్థం చేసుకోవచ్చు. కంటెంట్ బాగుందని పేరొచ్చినా ఏదో మిస్ అయ్యిందనే ఫీలింగ్ గాడ్ ఫాదర్ రేంజ్ ని తగ్గించేసింది.
దానికి కారణాలు తర్వాత విశ్లేషించుకోవచ్చు కానీ ఇప్పుడు మెగా ఫ్యాన్స్ తమ భారమంతా వాల్తేర్ వీరయ్య మీదే పెడుతున్నారు. దీపావళికి టీజర్ తో పాటు సంక్రాంతి రిలీజ్ డేట్ ని కన్ఫర్మ్ చేయబోతున్నారు. దీని తర్వాత వచ్చే భోళా శంకర్ మళ్ళీ రీమేకే కాబట్టి ఏ రికార్డైనా వీరయ్యతోనే సాధ్యమని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. దానికి తగ్గట్టే లీకైన ఫొటోల్లో చిరంజీవి చేపలుపట్టే వాడిగా ఊర మాస్ గెటప్ లో రౌడీ అల్లుడు, దొంగమొగుడు నాటి లుక్స్ ని గుర్తుకు తెస్తున్నారు. మాస్ కంటెంట్ కనక కరెక్ట్ గా కుదిరితే మళ్ళీ చిరు రేంజ్ ఏంటనేది దీంతో ప్రూవ్ అవుతుంది. దర్శకుడు బాబీ మాత్రం దీనికి పక్కా హామీ ఇస్తున్నాడు.
This post was last modified on October 15, 2022 1:56 pm
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…
వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.…
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…