మెగాస్టార్ స్వయంగా మన ‘ఆటోజాని’ సినిమా ఎప్పుడంటూ లైవ్ లోనే దర్శకుడు పూరి జగన్ ను అడిగేయడంతో.. ఆ కథను ఆల్రెడీ ‘పైసా వసూల్’ అంటూ తీసేశా సార్ అని చెప్పాలేడు కాబట్టి, ఆ కతను పక్కనెట్టేశానండీ.. మీకోసం ఇంకోటి రాస్తున్నా అంటూ ఈ డ్యాషింగ్ డైరక్టర్ సెలవిచ్చాడు. దానితో ఇప్పుడు బోళా శంకర్, వాల్తేర్ వీరయ్య సినిమాలు పూర్తవ్వగానే పూరి జగన్ తో మెగాస్టార్ చిరంజీవితోనే సినిమా చేస్తాడంటూ టాక్ వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా వర్కవుట్ అవ్వాలంటే మాత్రం మన దర్శకుడు రెండు విషయాలను మానుకోవాలి.
పాయింట్ నెం1 ఏంటంటే.. అసలు కథ లేని కథలతో సినిమాలు తీయడం అనేది కష్టం అని పూరి జగన్ తెలుసుకోవాలి. లైగర్ సినిమాలో కూడా.. బడ్జెట్ ఉంది, గ్లామర్ ఉంది, మాంచి యాక్టర్లున్నారు.. కాని కథ మాత్రం లేదు. పాత చింతకాయ పచ్చడి స్టోరీలకు కొత్తతరం పంచులు కొన్ని రాసి తీసేస్తే సినిమాలు ఆడట్లేదు. అసలు కథ లేకపోతే మెగాస్టార్ సినిమాయే ఇవ్వరనుకోండి వేరే సంగతి, కాని ఒక్కోసారి చిరంజీవి కూడా పప్పులో కాలేస్తున్నారు కాబట్టి, కథ కరక్టుగా ఉందా లేదా అనే విషయం పూరీయే చూసుకోవాలి.
రెండోది ఏంటంటే.. పూరితో సినిమా అంటే ఈ మధ్య బడ్జెట్ లిమిట్ ఉండట్లేదట. ఆయన వాస్తవానికి సొంత ప్రొడక్షన్లే చేసుకుంటున్నాడు కాని, లైగర్ సినిమాకు కరణ్ జోహార్ ఇన్వెస్టర్ గా వచ్చాడు కాబట్టి నష్టాలు మినిమైజ్ అయ్యాయ్, లేకపోతే పూరి అండ్ ఛార్మి ఇద్దరూ చాలా క్రిటికల్ పొజిషన్లోకి స్లిప్పయిపోయేవారని ఇండస్ట్రీ టాక్. కంట్రోల్ లేకుండా సినిమాలు తీస్తున్నారని, ఒకప్పటిలా పూరి జగన్ అసలు రికార్డు టైములో సినిమాను పూర్తి చేయలేకపోతున్నాడటి టాక్. మరి మెగాస్టార్ తో సినిమా అంటే అలా డిలే చేయడం కుదరదు. ఆయన కూడా బడ్జెట్ ను దృష్టిలో ఉంచుకుని పనిచేసే యాక్టర్. కాబట్టి డిసిప్లైన్ లేకుండా సినిమా తీయడం ఆయనతో కష్టమే.
ఏదేమైనా కూడా పూరి జగన్ తో సినిమా అనగానే వావ్ వావ్ అని అందరూ అంటున్నారు కాని, పూరి మాత్రం పైన రెండు చెప్పిన రెండు పాయింట్లు జాగ్రత్తగా చూసుకుని సినిమా చేస్తేనే ఆయన కెరియర్ కు ప్లస్సయ్యేది.