ఇటు తెలుగులో, అటు తమిళంలో, మరోవైపు హిందీలో క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తుండగానే.. కొవిడ్ టైంలో హఠాత్తుగా పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది కాజల్ అగర్వాల్. దీంతో మధ్యలో ఉన్న ఆమె సినిమాల పరిస్థితి ఏంటో అర్థం కాలేదు. కానీ పెళ్లి తర్వాత కూడా ‘ఆచార్య’తో పాటు ‘ఉమ’ అనే హిందీ చిత్రంలో నటించింది. కొన్ని కారణాల వల్ల ‘ఆచార్య’ నుంచి ఆమె పాత్రను తీసేయగా.. ‘ఉమ’ సినిమా పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉంది. ఈలోపు కాజల్ గర్భం ధరించింది. బిడ్డకు జన్మ కూడా ఇచ్చింది.
డెలివరీ తర్వాత కొన్ని నెలలు గ్యాప్ తీసుకుని మళ్లీ ఫిట్‌గా తయారయ్యే ప్రయత్నంలో ఉన్న కాజల్.. ఇటీవలే పున:ప్రారంభం అయిన ‘ఇండియన్-2’ షూట్‌కు కూడా ఆమె హాజరు కాబోతోంది. ఐతే సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలనుకున్నాక చందమామ కొత్త ప్రాజెక్టులు ఒప్పుకోకుండా ఎలా ఉంటుంది? ఆమె ఒక సీక్వెల్ మూవీలో భాగం కాబోతున్నట్లు సమాచారం.
లారెన్స్ హీరోగా తెరకెక్కుతున్న ‘చంద్రముఖి-2’లో కాజల్ ముఖ్య పాత్ర పోషించబోతోందట. ఇంతకుముందే ‘చంద్రముఖి’కి కొనసాగింపుగా కన్నడలో ‘ఆప్తరక్షక’, తెలుగులో ‘నాగవల్లి’ చిత్రాలను రూపొందించిన పి.వాసు ఇప్పుడు తమిళంలో ఓ కొత్త కథతో ‘చంద్రముఖి-2’ సినిమా తీస్తున్నాడు. ఈ చిత్రంలో ముఖ్య పాత్ర కోసం కాజల్‌ను సంప్రదించగా ఆమె ఓకే చెప్పినట్లు సమాచారం.
ఐతే దర్శకుడిగా ఎప్పుడో ఔట్ డేట్ అయిపోయిన పి.వాసు.. లారెన్స్‌ను పెట్టి ఇప్పుడు ‘చంద్రముఖి-2’ తీయడం పట్ల ప్రేక్షకుల్లో సానుకూల స్పందన అయితే లేదు. చంద్రముఖి పేరు చెప్పి సినిమాను అమ్ముకునే ప్రయత్నం లాగా కనిపిస్తోందిది. ఐతే ఎప్పుడో అనౌన్స్ చేసిన ఈ చిత్ర షూటింగ్ అంతగా ముందుకు కదలడం లేదు. లారెన్స్ ‘రుద్రన్’తో పాటు మరో సినిమాతో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లనుంది. ‘చంద్రముఖి’లో కడుపు చెక్కలు చేసిన వడివేలు’ ఈ చిత్రంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
This post was last modified on October 13, 2022 11:24 am
హారర్ కామెడీ జానర్లో ప్రేక్షకులని ఆకట్టుకున్న కాంచన సిరీస్‌లో మరో సినిమా రాబోతోన్న విషయం తెలిసిందే. రాఘవ లారెన్స్ దర్శకత్వం…
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి ప్రమోటర్స్ కావాలా? పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే.. వ్యూహాలు రచించడంతోపాటు.. ప్రజలకు పార్టీని చేరువ చేసేందుకు ప్రమోటర్ల…
కొత్త సినిమాలకు ముందు రోజు ప్రీమియర్లు వేయడం కొత్త కాకపోయినా ఇది రెండువైపులా పదునున్న కత్తిలా మారడంతో ఉపయోగాలు ఎన్ని…
మెల్లగా గేమ్ ఛేంజర్ గేరు మారుస్తోంది. ఇప్పటికే మూడు పాటలు, ఒక టీజర్ వచ్చాయి. ఎల్లుండి జరగబోయే యుఎస్ ప్రీ…
ఏపీ ఫైబర్ నెట్ సంస్థపై వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అవకతవకల గురించి ఆ సంస్థ చైర్మన్ జీవీ…
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…