రెండేళ్ల విరామం తర్వాత రీఎంట్రీ ఇచ్చాక వరుసగా రెండు రీమేక్ సినిమాల్లో నటించాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అవి ఉన్నంతలో మంచి ఫలితాలే అందుకున్నప్పటికీ.. అన్ని భాషల చిత్రాలనూ అందరూ చూసేస్తున్న ఈ రోజుల్లో రీమేక్‌లంటేనే జనాలు పెద్దగా ఆసక్తి ఉండట్లేదు.
ఈ నేపథ్యంలో వేరే భాషా చిత్రాలను రీమేక్ చేయడం ఇక ఆపేస్తే బెటర్ అన్న ఫీలింగ్ అందరిలోనూ వచ్చేస్తోంది. అందుకే పవన్ హీరోగా తమిళ చిత్రం వినోదిత సిత్తం చిత్రాన్ని రీమేక్ చేయబోతున్నారన్న వార్త బయటికి రాగానే అభిమానుల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అందులోనూ ఆ సినిమా చాలా డల్లుగా సాగుతుంది. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ చిత్రాల్లో మాదిరి కాస్తో కూస్తో మాస్ మూమెంట్స్ పెట్టడానికి కూడా ఆస్కారం ఉండదు.
ఐతే ఈ సినిమాను పట్టాలెక్కించే విషయంలో చాలా గందరగోళం నెలకొంది. మార్చిలోనే సినిమా మొదలవుతుందని అన్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఆ తర్వాత ఒకట్రెండు సందర్భాల్లో సినిమా ముందుకు కదులుతున్నట్లు వార్తలొచ్చాయి. కానీ మళ్లీ ప్రాజెక్టు పక్కకు వెళ్లిపోయినట్లే కనిపించింది. ఐతే తాజాగా ఈ చిత్రాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారని, ఇక సినిమా పట్టాలెక్కే అవకాశమే లేదని ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. కాగా అదే సమయంలో ఈ ఊహాగానాలను నిర్మాతలు ఖండించినట్లు కూడా వార్తలొస్తున్నాయి.
పీపుల్స్ మీడియా అధినేతలు ఈ చిత్రాన్ని నిర్మిస్తారని గతంలో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. వాళ్లే ఈ ఊహాగానాలను ఖండించినట్లుగా చెబుతున్నారు. ఐతే ఇప్పటిదాకా అధికారికంగా ప్రకటించని సినిమా గురించి ఇలా ఊహాగానాలు రావడమేంటో.. దాన్ని నిర్మాతలు ఖండించడమేంటో.. అసలు చేతిలో ఉన్న హరిహర వీరమల్లు చిత్రాన్నే పూర్తి చేయలేక, రెండేళ్ల ముందు ప్రకటించిన భవదీయుడు భగత్ సింగ్ మూవీని పట్టాలెక్కించలేక వాటి దర్శక నిర్మాతలను ఇబ్బంది పెడుతున్న పవన్.. వినోదియ సిత్తం రీమేక్ కోసం అసలెలా డేట్లు కేటాయిస్తాడన్నది అర్థం కాని విషయం.
This post was last modified on October 12, 2022 9:54 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…