తన మొదటి హిందీ సినిమా ఒక ప్రక్కన రిలీజవుతున్న కూడా.. శుక్రవారం ఉదయం ఫ్లైట్ ఎక్కేసి మాల్డీవ్స్ చెక్కేసింది ముద్దుగుమ్మ రష్మిక మందన్నా. పోనివ్ ఒక్కత్తే సోలో హాలిడేకు వెళ్ళిందా అంటే.. అదీ కాదు. అసలు మా మధ్యన ఏం లేదు అంటూనే ఇప్పుడు విజయ్ దేవరకొండతో కలసి హిందూ మహాసముద్రంలో సరదాగా సేదతీరడానికి వెళ్లిపోయింది. వీరిద్దరూ కలసి ఒక్క ఫోటోలు కూడా పెట్టట్లేదేంటబ్బా అంటూ వస్తున్న కామెంట్లను అటుంచితే.. అసలు ఇద్దరూ ఏం నేర్చుకున్నారో అనే డిస్కషన్ కూడా ఇప్పుడు ఎక్కువైందనే చెప్పాలి.
ఒక ప్రక్కన తన ఇండియాలోనే బిగ్గెస్ట్ హిట్ తీశాం.. సినిమా ధియేటర్లలో మీరెవ్వరూ తలదించుకునే ఛాన్సుండదని అంటూ ‘లైగర్’ సినిమాను భారీగా ప్రమోట్ చేసిన విజయ్ దేవరకొండ.. సినిమా రిలీజయ్యాక మాత్రం భారీ షాక్ తినేశాడు. అప్పటికే ఆల్రెడీ చాలా ఫ్లాపులు చవిచూసిన విజయ్ కు మరో ఫ్లాప్ వలన వచ్చే బాధ ఏముందిలే అనుకోవచ్చు కాని.. పాన్ ఇండియా లెవెల్లో దెబ్బ పడితే దాని పెయిన్ మాత్రం మామూలుగా ఉండదు కదా.
ఇప్పుడు అదే తరహాలో తన తొలి బాలీవుడ్ మూవీ అయిన ‘గుడ్ బాయ్’ ను చాలా గట్టిగానే ప్రమోట్ చేసింది రష్మిక. కాకపోతే ఇక రిలీజయ్యాక తాను చేసేదేం ఉండదు కాబట్టి, వెంటనే మాల్డీవ్స్ చెక్కేసింది. సినిమాకు నెగెటివ్ రివ్యూస్ రాగా, అందులో ముందుగా ఆమె యాక్టింగ్ కు మరియు హిందీ స్లాంగ్ కు ఇంకా ఎక్కువ నెగెటివ్ రివ్యూస్ వచ్చేశాయ్.
హిట్ సినిమాతో డబ్బులొస్తాయ్, పేరొస్తొంది, ఇమేజ్ పెరుగుతుంది. కాని.. ఫ్లాప్ సినిమాలతోనే ఒక స్టార్ లో ఉన్న లూప్ హోల్స్ మరియు వీక్నెస్ లు బయటపడతాయ్. అందుకే.. ఈ ఇద్దరూ అసలు ఈ ఫ్లాప్స్ తో ఏం నేర్చుకుని ఉంటారు అనేది ఇప్పుడు డిస్కషన్. తాము కథలను ఎంచుకోవడంలో ఎటువంటి మిస్టేక్స్ చేస్తున్నామో తెలుసుకుంటేనే వీరిద్దరూ కూడా ఎక్కవకాలం సినిమాల్లో రాణించే ఛాన్సుంటుంది. అలా కాకుండా 24 గంటలూ సంచలనాలు క్రియేట్ చేయడం, లేదంటే సోషల్ మీడియాలో అభిమానులను పెంచుకోవడం వంటి అంశాలపై ఫోకస్ చేస్తే మాత్రం.. అబ్బే కాస్త కష్టమే.
This post was last modified on October 10, 2022 12:29 pm
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…