కెరీర్ మొదలుపెట్టి చాలా ఏళ్ళవుతున్నా, హీరోగా రెండు మూడు మంచి హిట్లే పడ్డా సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న సత్యదేవ్ కు ఆ కోరిక గాడ్ ఫాదర్ రూపంలో తీరింది. విలన్ క్యారెక్టరే అయినప్పటికీ అన్ని వర్గాల నుంచి గొప్ప ప్రశంసలు దక్కాయి. చిరంజీవి పదే పదే పలు సందర్భాల్లో ఈ స్థాయిలో పొగడటం గత కొన్నేళ్లలో ఎవరికీ జరగలేదు. ఆ రకంగా చూసుకుంటే ఈ విలక్షణ నటుడు అదృష్టవంతుడే. దెబ్బకు ఆఫర్లు క్యూ కడుతున్నాయని సమాచారం. వాటిలో ఎక్కువ విలన్ వేషాలే ఉన్నప్పటికీ సత్యదేవ్ తొందరపడే ఆలోచనలో లేడు. ఇదే జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఆచితూచి అడుగులు వేయాలి.
ఇప్పుడీ మెగా బ్రేక్ వల్ల సత్యదేవ్ కొత్త సినిమాలకు కాళ్లొచ్చేలా ఉన్నాయి. అందులో మొదటిది గుర్తుందా శీతాకాలం. నిర్మాణం ఎప్పుడో పూర్తి చేసుకున్న ఈ కన్నడ బ్లాక్ బస్టర్ రీమేక్ లో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్. పలు కారణాల వల్ల విడుదల ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది. కాంబినేషన్ పరంగా పెద్దగా క్రేజ్ లేకపోవడం, ఎమోషనల్ లవ్ స్టోరీ కావడంతో ఏ అంచనాలు లేకుండా డల్ గా ఉండిపోయింది. ఇప్పుడు సత్యదేవ్ కి ఫ్యామిలీ ఆడియన్స్ లోనూ గుర్తింపు వచ్చేసింది కాబట్టి సరైన టైం చూసుకుని వదిలితే ముందు అనుకున్న దాని కన్నా మంచి ఫలితమే దక్కుతుంది.
దీంతో పాటు కొరటాల శివ నిర్మాణంలో రూపొందిన కృష్ణమ్మ కూడా సిద్ధంగా ఉంది. విలన్ వేషం వేసినంత మాత్రాన మళ్ళీ హీరోగా కంబ్యాక్ అవ్వకూడదనేం లేదు. మోహన్ బాబు, గోపిచంద్ లాంటి వాళ్ళు ఇలా రెండు రకాలుగా ప్రూవ్ చేసుకున్నాకే స్టార్లయ్యారు. ఎవరి దాకో ఎందుకు చిరంజీవి కెరీర్ ప్రారంభంలో ఇది కథ కాదు, ఐ లవ్ యు లాంటి చిత్రాల్లో వేసింది నెగటివ్ షేడ్సే. ఖైదీతో బ్రేక్ దక్కింది. సో ఇప్పుడు సత్యదేవ్ కు కావాల్సింది సరిగ్గా ఇలాంటి మలుపులే. గాడ్ ఫాదర్ వల్ల హిందీలోనూ గుర్తింపు వచ్చేసింది. మూడో వారంలో వచ్చే అక్షయ్ కుమార్ రామ్ సేతు కూడా సక్సెస్ అయితే కుర్రాడి దశ తిరిగినట్టే.
This post was last modified on October 9, 2022 10:32 pm
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…
బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…
వరుస ఫ్లాపుల కారణంగా గత కొన్నేళ్లలో మాస్ రాజా రవితేజ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ బాగా దెబ్బ తిన్న మాట…
అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…
సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…
చాట్‌జీపీటీ, జెమినీ, క్లాడ్ లాంటి AI సేవల వెనుక భారీ డేటా సెంటర్లు, ఖరీదైన చిప్స్, విద్యుత్ అవసరం ఉంటుంది.…