Movie News

అల్లు అరవింద్ తెలివే తెలివి


కాంతార.. ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న సినిమా ఇది. ‘కేజీఎఫ్’తో సంచలనం రేపిన హోంబళె ఫిలిమ్స్ నుంచి వచ్చిన మరో భారీ చిత్రమిది. దర్శకుడు రిషబ్ శెట్టి తనే ముఖ్య పాత్ర పోషిస్తూ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను రూపొందించాడు. కన్నడలో వచ్చిన అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా దీన్ని అందరూ కొనియాడుతున్నారు. ఈ సినిమా కథాంశం, నటీనటుల పెర్ఫామెన్స్, విజువల్స్, భారీతనం, అలాగే పతాక సన్నివేశాలకు సంబంధించి ప్రశంసల జల్లు కురుస్తోంది.

కన్నడ నాట సంచలన వసూళ్లు రాబడుతున్న ఈ సినిమా గురించి ఇతర భాషల వాళ్లకూ బాగానే ఆసక్తి కలిగింది. హైదరాబాద్, చెన్నై, కొచ్చి, ముంబయి లాంటి ప్రధాన నగరాల్లో ‘కాంతార’కు విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది. ఆయా నగరాల్లో అందుబాటులో ఉన్న స్క్రీన్లలో సినిమాను ప్రదర్శిస్తుండగా.. హౌస్ ఫుల్స్ పడుతున్నాయి.

‘కాంతార’ కన్నడ వెర్షన్ కోసం తెలుగు ప్రేక్షకులు ఎగబడుతున్న తీరు చూసిన అగ్ర నిర్మాత అల్లు అరవింద్ వెంటనే రంగంలోకి దిగిపోయారు. దసరాకు మూడు సినిమాలు రిలీజైన నేపథ్యంలో తర్వాతి వారానికి తెలుగులో చెప్పుకోదగ్గ సినిమాలేవీ షెడ్యూల్ అయి లేవు. ‘బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్’ లాంటి చిన్నా చితకా సినిమాలే వస్తున్నాయి. దసరా చిత్రాల్లో ‘ది ఘోస్ట్’, ‘స్వాతిముత్యం’ పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో వచ్చే వారానికి అవి చాలా థియేటర్లను ఖాళీ చేయబోతున్నాయి. ఈ అడ్వాంటేజీని అరవింద్ ఉపయోగించుకోబోతున్నారు.

‘కాంతార’ తెలుగు వెర్షన్‌ను వచ్చే శుక్రవారమే గీతా ఆర్ట్స్ ద్వారా రిలీజ్ చేయబోతున్నారు. ఈ నిర్ణయం గత రెండు మూడు రోజుల్లోనే జరిగినట్లు తెలుస్తోంది. వెంటనే హక్కులు తీసుకోవడం, డబ్బింగ్ పనులు మొదలుపెట్టేయడం జరిగిపోయింది. ‘కాంతార’ కన్నడ వెర్షన్‌కు వస్తున్న రెస్పాన్స్ చూసి, వచ్చే వారం థియేటర్లు ఖాళీగా దొరకడం గమనించి ఇంత వేగంగా స్పందించి తక్కువ వ్యవధిలో సినిమాను రెడీ చేస్తుండడం చూసి అల్లు అరవింద్ తెలివే తెలివి అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి టాలీవుడ్లో.

This post was last modified on October 9, 2022 1:34 pm

Share

Recent Posts

టికెట్ల రేట్ల ఎఫెక్ట్ చూశారా?

తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కాస్త పర్లేదంటే థియేటర్లకు వరుస కట్టేస్తారు.…

8 hours ago

ఇంతకీ అలియాస్ రుక్మిణి ఎవరు?

ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…

10 hours ago

కోన మీద కోపం తగ్గిందా?

కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…

10 hours ago

సామాజిక వ‌ర్గ రాజ‌కీయం క‌లిసొచ్చిందా జ‌గ‌న్‌… ?

రాజ‌కీయాల్లో ఉన్న‌వారు.. ఒక‌వైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచ‌న చేస్తామంటే కుదురుతుందా? అంటే కాద‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. కానీ,…

10 hours ago

చరణ్ కోసం అనిరుధ్ బెస్ట్ ఇవ్వాల్సిందే

పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…

14 hours ago

ఇంకో వాయిదా అడగనున్న ఆదర్శం ?

అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…

14 hours ago