ఇంకో రెండు వారాల్లో డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజు రాబోతోంది. ఇటీవలే పెదనాన్న కృష్ణంరాజు కాలం చేయడంతో సంబరాలు ఉండవేమో అనుకున్నారు కానీ రీ రిలీజుల రూపంలో జరుపుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందులో భాగంగా అక్టోబర్ 15న రెబల్ ని థియేటర్లలో తీసుకొస్తున్నారు. దీని ప్రకటన రాగానే ఫ్యాన్సే షాక్ తిన్నారు. ఎందుకంటే ఇది మాములు డిజాస్టర్ కాదు. అప్పట్లో సోషల్ మీడియా 2022 స్థాయిలో లేదు కానీ ఉంటే మాత్రం దర్శకుడు రాఘవేంద్ర లారెన్స్ ఈ కళాఖండాన్ని తీర్చిదిద్దిన విధానానికి అభిమానులు ట్రోలింగ్ తో విరుచుకుపడేవారు.
సరే గతం గతః అనుకుంటే ఆ మర్చిపోలేని గాయాన్ని ఎందుకు మళ్ళీ స్క్రీన్ మీద చూపిస్తారని అప్పుడే కామెంట్లు మొదలయ్యాయి. అయితే ఊరట కలిగించే వార్త మరొకటి ఉంది. ఇదే నెల 23, 24 తేదీల్లో ఆల్ టైం బ్లాక్ బస్టర్ వర్షంని 4Kతో వెండితెరపై ప్రదర్శించబోతున్నారు. ఒకవేళ రెబెల్ చూసి తట్టుకోలేం అనుకుంటే హ్యాపీగా వర్షం చూసి ఎంజాయ్ చేయొచ్చన్న మాట. ఇది మాత్రం సరైన నిర్ణయమే. ఎందుకంటే 2004లో వచ్చిన ఈ మ్యూజికల్ సూపర్ హిట్ చాలా రికార్డులు సాధించింది. ప్రభాస్, త్రిషల జంటకు దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన సంగీతం చేసిన రచ్చ మాములుది కాదు.
మొత్తానికి ఈ ఒక సాడ్ ఒక హ్యాపీ మూవీతో ప్రభాస్ ఫ్యాన్స్ బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు. గత రెండు నెలల నుంచి ఈ రీ రిలీజుల ట్రెండ్ ఊపందుకుంటోంది. పోకిరి, ఘరానా మొగుడు, తమ్ముడు, జల్సా, చెన్నకేశవరెడ్డి, 3 ఒకదాన్ని మించి మరొకటి పోటీపడి కలెక్షన్లు రాబట్టాయి. జనవరిలో ఒక్కడుని ప్లాన్ చేస్తున్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆల్రెడీ జులాయి, దేశముదురు కావాలని డిమాండ్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆది, సింహాద్రి కోసం ఎదురు చూస్తున్నారు. ఇటీవలే అమితాబ్ నటించిన 11 పాత క్లాసిక్స్ ని పివిఆర్ మల్టీప్లెక్స్ చైన్ స్పెషల్ ప్రీమియర్ చేయడం మనల్ని చూసి తెచ్చుకున్న ఐడియానే.
This post was last modified on October 9, 2022 10:02 am
ప్రస్తుతం మనలో చాలామంది తెలిసో తెలియకో ఇబ్బంది పడే సమస్యలలో యూరిక్ యాసిడ్ పెరుగుదల కూడా ఒకటి. చలికాలంలో ఈ…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…