Movie News

యాజిటీజ్ జాన్ విక్ స్టయిలేగా? ప్రాబ్లమేంటి?

హాలీవుడ్లో ఒకప్పుడు దుమ్ములేపిన సినిమా ‘జాన్ విక్’. మ్యాట్రిక్స్ సినిమా ఫేం కియాను రీవ్స్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాలో సర్వత్ర్రా స్టయిలిష్ యాక్షన్ సన్నివేశాలే ఉంటాయ్. ఆ సినిమాను ఇనిస్పిరేషన్ గా తీసుకునే మనోళ్ళు కెజిఎఫ్‌ నుండి మొన్నటి బ్లాక్ బస్టర్ విక్రమ్ వరకు చాలా తీశారు. నిజానికి జాన్ విక్ సినిమాలో కథ పెద్దగా ఉండదు. కేవలం గతించిన తన భార్య గుర్తుగా ఉంచుకున్న కుక్కపిల్లను చంపేశారని.. యావత్ మాఫియా బ్యాచ్ అందరినీ చంపేయడానికి బ్యాగ్ వేసుకుని బయలుదేరుతాడు జాన్ విక్. అదే కథ. మరి యాజిటీజ్ అదే కథను చూసి తయారుచేసుకున్న ‘ది ఘోస్ట్’ వంటి సినిమాలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయ్? ఇప్పుడు చాలామంది ప్రశ్న ఇదే.

జాన్ విక్ స్టయిల్లో సినిమా అంటే కొత్తగా ఉండే యాక్షన్ సన్నివేశాలు ఒక్కటే కాదు. అక్కడ వాడే గన్నులూ, మాఫియా బిహేవ్ చేసే పద్దతి.. ఈ నార్మల్ ప్రపంచంలో మనకు తెలియని మరో ప్రపంచం ఉందే అనే తరహాలో ఉంటాయి. పైగా కుక్కపిల్లను చంపినందుకు అని చెబుతున్న ఎమోషన్ ఏదైతే ఉందో.. అది చాలా నెక్ట్స్ లెవెల్లో ఉంటుంది. కెజిఎఫ్‌ లో కూడా మదర్ ఎమోషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అలాగే విక్రమ్ సినిమాలో కమల్‌ హాసన్ కు కొడుకు మరియు మనవడితో ఉండే ఎమోషన్ చాలా హార్డుగా ఉంటుంది. వాటితో మనల్ని కట్టిపాడేస్తారు కాబట్టే, తరువాత సీన్ ఎలా ఉంటుందో అనే కుతూహలం ప్రేక్షకుడిగా కూడా కలుగుతుంది. ది ఘోస్ట్ వంటి సినిమాల్లో మాత్రం.. జాన్ విక్ తరహాలో సింపుల్ వేఫర్ థిన్ ప్లాట్ పెట్టేసుకుని.. ఎమోషన్ ని ఏ మాత్రం రాస్కోకుండా.. కేవలం స్టయిలిష్ యాక్షన్ సన్నివేశాలు పెట్టేశాం అంటే.. ఆడియన్స్ కు అస్సలు ఎక్కట్లేదు. అదే అసలు ప్రాబ్లమ్. 20 ఏళ్ల తరువాత అక్క ఫోన్ చేసింది అనగానే వచ్చి ఆమె కోసం మర్డర్లు చేసేంత ఎమోషన్ నాగార్జున అండ్ గుల్ పనాగ్ క్యారక్టర్ల మధ్యన మనకు కనిపించదు. పైగా వాళ్లు అప్పట్లో విడిపోయిన రీజన్ కూడా చాలా సిల్లీగా ఉంటుంది.

పైగా ఒకప్పుడు లాజిక్ లేకుండా హీరో ఏ ఆయుధం వాడేశాడు అని చూస్కోకుండా జనాలు సినిమాను ఎంజాయ్ చేసేవారు. ఇప్పుడలా కాదు. హీరో ఒక కటానా కత్తిని వాడుతున్నాడంటే.. ఆ కత్తి ఎక్కడిది, అతనికి పలానా మార్షల్ ఆర్ట్ లో ట్రైనింగ్ ఎలా వచ్చింది అనేది చాలా క్షుణ్ణంగా చూస్తున్నారు ప్రేక్షకులు. మా హీరో కొత్తరకం కత్తి పట్టేశాడు అంటే ఫ్యాన్స్ పొలోమని ధియేటర్లకు వచ్చేయట్లేదు. సో.. జాన్ విక్ తీస్తున్నాం అనుకునే వాళ్లందరూ ముందుగా లాజిక్స్ అండ్ ఎమోషన్ మీద గట్టిగా పనిచేస్తేనే సినిమాలు వర్కవుట్ అవుతాయ్.

This post was last modified on October 7, 2022 10:42 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జ‌గ‌న్‌కు భ‌యం తెలీదు: వైసీపీ పంచాంగం!

శ్రీవిశ్వావ‌సు నామ తెలుగు సంవ‌త్స‌రాదిని పుర‌స్క‌రించుకుని గుంటూరు జిల్లా తాడేప‌ల్లిలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాల‌యంలో ఉగాది ఉత్స‌వాల‌ను నిర్వ‌హించారు.…

45 minutes ago

అర్ధరాత్రి వేళ సికందర్ పైరసీ కలకలం

ఇవాళ సల్మాన్ ఖాన్ సికందర్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయ్యింది. ప్రమోషనల్ కంటెంట్ బజ్ ని పెంచలేకపోయినా కండల వీరుడి మాస్…

1 hour ago

‘పేద‌ల‌కు ఉగాది’.. చంద్ర‌బాబు కీల‌క నిర్ణ‌యం

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఉగాదిని పుర‌స్క‌రించుకుని కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. తెలుగు వారి పండుగలలో ప్ర‌ధంగా వ‌చ్చే ఉగాదిని పుర‌స్క‌రించుకుని…

2 hours ago

అమరావతికి తిరుగు లేదు… ఆరోసారీ సీఎంగా చంద్రబాబు

నవ్యాంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి ఇకపై ఎలాంటి ముప్పు వాటిల్లే అవకాశమే లేదు. అంతేనా… అమరావతిని ఏపీకి రాజధానిగా…

2 hours ago

17 కత్తిరింపులతో ఎంపురాన్ కొత్త రూపం

అనూహ్యంగా రాజకీయ రంగు పులుముకున్న ఎల్2 ఎంపురాన్ కంటెంట్ గురించి అభ్యంతరాలు తలెత్తి దర్శకుడు పృథ్విరాజ్ సుకుమారన్, రచయిత గోపి…

3 hours ago

ఇలాగైతే సన్‌రైజర్స్ మ్యాచ్ లు హైదరాబాద్ లో ఉండవట

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) - సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకి మధ్య తాజా వివాదం తీవ్రంగా మారేలా కనిపిస్తోంది. ఉచిత…

3 hours ago