కొన్ని సినిమాల గొప్పదనం అవి రిలీజైనపుడు, థియేటర్లలో ఉన్నపుడు తెలియదు. వాటి థియేట్రికల్ రన్ ముగిసిపోయిన కొంత కాలానికి టీవీల్లోకి వచ్చాక ఆ చిత్రాలను బాగా అర్థం చేసుకుంటారు. వాటిని ఎంజాయ్ చేస్తారు. ఈ జాబితాలో చేర్చదగ్గ తెలుగు చిత్రాల్లో ‘ఖలేజా’ ఒకటి. 12 ఏళ్ల కిందట దసరా సీజన్లోనే ఈ చిత్రం రిలీజైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. డిజాస్టర్ టాక్ తెచ్చుకుని అందుకు తగ్గ ఫలితమే అందుకుంది.
కానీ ఈ చిత్రం టీవీల్లో ప్రసారమయ్యాక జనాల స్పందన మారిపోయింది. టీవీల్లోనే కాక యూట్యూబ్‌లో ఈ సినిమాను జనం విరగబడి చూశారు. ముఖ్యంగా ఈ సినిమాలో కామెడీకి జనాలు మామూలుగా కనెక్ట్ కాలేదు. అలాగే పాటలు, హీరో ఎలివేషన్లు, యాక్షన్ ఘట్టాలు చూసి కూడా తర్వాత తర్వాత మైమరిచిపోవడం మొదలైంది.
ఈ సినిమా 12వ వార్షికోత్సవం సందర్భంగా నిన్న సాయంత్రం నుంచి ‘ఖలేజా’ ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది. ఇటు మహేష్ అభిమానులు, అటు త్రివిక్రమ్ ఫ్యాన్స్ ఈ చిత్రంలోని కామెడీ.. మాటలు.. ఎలివేషన్ సీన్లు, పాటల గురించి ఒక రేంజిలో ఎలివేషన్లు ఇస్తున్నారు. మహేష్ పాత్రను మహాభారతంలో శ్రీ కృష్ణుడితో పోలుస్తూ త్రివిక్రమ్ ఒక ప్రెస్ మీట్లో చెప్పిన భాష్యం.. దైవం మానుష్య రూపేణా అనే కాన్సెప్ట్‌ను సినిమాలో త్రివిక్రమ్ ప్రెజెంట్ చేసిన విధానాన్ని చాలా బాగా అర్థం చేసుకుంటూ ఆయనకు సలాం కొడుతున్నారు.
ఇంకా సినిమాలో కల్ట్ స్టేటస్ తెచ్చుకున్న అనేక సన్నివేశాల గొప్పదనాన్ని ఇప్పుడు విడమరిచి చెబుతూ, అర్థం చేసుుకంటూ త్రివిక్రమ్‌కు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. మహేష్ బాబు, మణిశర్మలకు కూడా మంచి ఎలివేషన్ ఇస్తున్నారు. వారి కెరీర్లోనే బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చారంటూ కొనియాడుతున్నారు. అప్పుడు పట్టించుకోని సినిమాకు ఇప్పుడు ఈ స్థాయిలో బ్రహ్మరథం పడుతుండడం విశేషమే.
This post was last modified on October 7, 2022 10:18 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…