అక్కినేని నాగార్జునకు బాక్సాఫీస్ దగ్గర మరోసారి చేదు అనుభవం తప్పేలా లేదు. ఆయన కొత్త చిత్రం ‘ది ఘోస్ట్’ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ‘గరుడవేగ’ లాంటి సెన్సేషనల్ మూవీతో అందరి దృష్టినీ ఆకర్షించిన ప్రవీణ్ సత్తారు.. ఈ చిత్రాన్ని రూపొందించడంతో ఇది మినిమం గ్యారెంటీ మూవీ అయి ఉంటుందని అనుకున్నారు. కానీ ప్రవీణ్ ప్రేక్షకులను బాగా నిరాశ పరిచాడు.
అసలే ఈ సినిమాకు విడుదల ముంగిట పెద్దగా బజ్ లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా డల్లుగా జరిగాయి. టాక్ కూడా బాగా లేకపోవడంతో వసూళ్లు మరీ తక్కువగానే వచ్చాయి తొలి రోజు. రెండో రోజు సినిమా పుంజుకుంటున్న సంకేతాలేమీ కనిపించడం లేదు. నాగ్ ఖాతాలో మరో పరాజయం జమ కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమా చూసిన వాళ్లంతా నాగ్ ఎందుకు మళ్లీ ఈ యాక్షన్ థ్రిల్లర్ జానర్ పట్టుకుని వేలాడుతున్నడనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
నాగ్ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర చేసిన ప్రతిసారీ ఆయనకు చేదు అనుభవమే ఎదురవుతోంది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగ్ నటించిన ‘ఆఫీసర్’ ఎంత దారుణమైన ఫలితాన్నందుకుందో తెలిసిందే. ఐతే వర్మ ఫాంలో లేడు కాబట్టి ఆ సినిమా అలా తయారవడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఐతే కొంచెం గ్యాప్ తర్వాత మళ్లీ నాగ్ ఇలాంటి ఆఫీసర్ రోల్ చేసిన ‘వైల్డ్ డాగ్’ మంచి టాక్ తెచ్చుకుని కూడా బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయింది.
ఐతే అప్పుడు కొవిడ్ ఉంది అందుకే ఆడలేదంటూ నాగ్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. మరి ‘ది ఘోస్ట్’ పరిస్థితి చూస్తే ఏమాత్రం ఆశాజనకంగా లేదు. నాగ్‌ను ఇలాంటి రోల్స్‌లో చూడ్డానికి ప్రేక్షకులు అసలు ఇష్టపడట్లేదా అనిపిస్తోంది. ఈ తరహా పాత్రలతో వరుసగా చేదు అనుభవాలు ఎదురవుతున్నా.. ప్రేక్షకుల దృష్టిని ఏమాత్రం ఆకర్షించలేకపోతున్నా నాగ్ ఎందుకు మళ్లీ మళ్లీ అవే ట్రై చేస్తున్నాడన్నది అర్థం కావడం లేదు. మధ్యలో ఆయన ‘బంగార్రాజు’ అనే ఎంటర్టైనర్ తీస్తే టాక్ బాలేకున్నా ఓ మోస్తరుగా ఆడింది. కాబట్టి నాగ్ ఇకపై ఇలాంటి సీరియస్ కాప్ థ్రిల్లర్ల జోలికి వెళ్లకపోవడమే మంచిది.
This post was last modified on October 6, 2022 9:43 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్‌లో పర్యటిస్తున్నారు. 43 ఏళ్ల తర్వాత.. భారత ప్రధాని కువైట్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. శనివారం…
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…