తమిళంలోనే కాదు తెలుగులోనూ మోస్ట్ వాంటెడ్ బిజీ ఆర్టిస్టుల్లో ఒకరైన సముతిరఖని నటుడిగా కెరీర్ ఊపందుకోక ముందే మంచి దర్శకుడన్న సంగతి మాస్ ఆడియన్స్ కి అంతగా అవగాహన లేదు కానీ సగటు మూవీ లవర్స్ కి బాగా తెలుసు. కాకపోతే తెలుగులో తీయలేదు అంతే. నిన్న రిలీజైన గాడ్ ఫాదర్ లో ఈయన పోలీస్ ఇన్స్ పెక్టర్ గా చేసిన క్యారెక్టర్ కు ప్రశంసలు దక్కుతున్నాయి. ఎక్కువ లెన్త్ లేకపోయినా కీలకమైన సన్నివేశాలు పడటంతో ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఉదయం దాకా వేచి చూసిన సముతిరఖని బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ రాగానే గాడ్ ఫాదర్ పోస్టర్లు, ఫోటోలతో ట్వీట్లు వేస్తున్నారు.
ఇక్కడే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వచ్చి వేడుకోలు కార్యక్రమం మొదలుపెట్టారు. దేనికంటారా. సముతిరఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ తో వినోదయ సితం రీమేక్ గురించి గత ఆరేడు నెలల నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ రచనలో వేగంగా పూర్తి చేయబోతున్నారనే ప్రచారం జోరుగా జరిగింది. సాయి ధరమ్ తేజ్ ఓ ముఖ్యపాత్రలో చాలా తక్కువ బడ్జెట్ తో తీస్తారని చెప్పుకున్నారు. కొంత కాలం ఈ ప్రాజెక్టు గురించి టాక్స్ ఆగిపోయాయి. ఇప్పుడు పాదయాత్ర వాయిదా పడి పవన్ తిరిగి షూటింగ్స్ లో పాల్గొనడానికి నిర్ణయం తీసుకోవడంతో వినోదయ సితం మళ్ళీ తెరపైకొచ్చింది.
ఒరిజినల్ వెర్షనే డైరెక్ట్ ఓటిటిలో వచ్చింది. అలాంటి కథని వంద కోట్ల మార్కెట్ ఉన్న పవన్ తో చేయడం గురించి ఇప్పటికే పవర్ స్టార్ అభిమానులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ లో అంత కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాయి. అలాంటిది గోపాల గోపాల తరహా థీమ్ తో రూపొందే వినోదయ సితం ఏదో అద్భుతం చేసే అవకాశం ఉందని వాళ్ళనుకోవడం లేదు. ఏదో చిరంజీవితో హిట్టు బొమ్మ చేశానని ఆనందపడుతున్న టైంలో సముతిరఖని ఊహించని విధంగా ఈ విన్నపాలు వెల్లువ చూసి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావడం లేదుట.
This post was last modified on October 6, 2022 12:34 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…