విజువల్ ఎఫెక్ట్స్ క్వాలిటీ బాలేదయ్యా సామీ అంటే.. మీకు యుట్యూబ్ లో చూస్తే అలాగే అనిపిస్తుంది, వెండితెర మీద చూస్తే మాత్రం పిచ్చెత్తిపోద్ది అంటూ కామెంట్ చేసిన ఘనుడు.. ఆదిపురుష్ డైరక్టర్ ఓం రౌత్. ప్రభాస్ హీరోగా, కృతి సేనన్ హీరోయిన్ గా.. ఇద్దరూ స్వయంగా సీతారాముడిలా కనిపించనున్న ఈ సినిమాకు ఇప్పుడు గ్రాఫిక్స్ అనేది పెద్ద శత్రువులా మారింది. అదే విషయం గురించి అడిగితే.. పెద్ద స్ర్కీన్ మీద చూడాల్సిన సినిమాను చిన్న మొబైల్లో చూస్తే అలాగే అనిపిస్తోంది అంటూ సూపర్బ్ గా కవర్ చేశాడు దర్శకుడు. అతగాడి మాటల్లో ఎంతవరకు నిజముందంటారు?
ప్రస్తుతం ఓటిటిలో చెలరేగిపోతున్న రెండు పెద్ద వెబ్ సిరీస్.. అమెజాన్ ప్రైమ్ లో వచ్చే ‘రింగ్స్ ఆఫ్ పవర్’, హాట్ స్టార్ లో వచ్చే ‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్’.. రెండూ కూడా 50% జనాభా మొబైల్ ఫోన్లోనే చూస్తున్నారు. కాని ఈ రెండు సీరీసుల్లో అసలు విజువల్ ఎఫెక్ట్స్ లేని ఫ్రేమ్ అంటూ ఉండదు. రింగ్స్ ఆఫ్ పవర్ లో దాదాపు ప్రతీ మనిషీకి ఏదో ఒక పార్ట్ కంప్యూటర్ లో ఎటాచ్ చేసిందే ఉంటోంది. అలాగే హౌస్ ఆఫ్ ది డ్రాగన్స్ లో మనం డ్రాగన్స్ ను చూస్తే వాటిని నిజంగానే చూస్తున్నామా అన్నంత రియలిస్టిక్ గా ఉంటాయ్. ఆ పాతయుగపు సెట్స్, ఎఫెక్ట్స్ దాదాపు అన్నీ సి.జి.లో చేసినవే. వాటిని మొబైల్ ఫోన్లో చూసినప్పుడు చెయ్యని కంప్లయిట్లు మరి ఎవరైనా కూడా ‘ఆదిపురుష్’ టీజర్ ను యుట్యూబ్ లో చూడగానే ఎందుకు వేలెత్తి చూపిస్తారు?
అసలు ఏ పాయింట్ మీద ట్రోల్ చేస్తున్నారు అని తెలియకుండా మాట్లాడితే అది ఖచ్చితంగా ఓం రౌత్ తరహాలోనే ఉంటుందని అనుకోవాలేమో. యుట్యూబ్ లో చూస్తే క్వాలిటీ ఉండదు.. పెద్ద తెరమీద సూపరుంటుంది అని దర్శకుడు చెబుతుంటే.. మరి ఆడియన్స్ చెవిలో ఏకంగా ఆదిపురుష్ టీజర్లో సీత క్యారక్టర్ ఇంట్రొడక్షన్ సీన్లో ఉన్న గ్రాఫిక్స్ పువ్వుల్ని పెట్టేస్తున్నాడని అర్ధమవుతోంది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే.. అక్కడొచ్చిన ట్రోలింగ్ కి, ఈయనిచ్చిన రెస్పాన్స్ కి.. దండేసి దణ్ణం పెట్టాలి.
This post was last modified on October 5, 2022 10:05 am
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో జరిగిన,…
ఓ వైపు సంధ్య థియేటర్ గొడవ ఎంత ముదురుతున్నా కూడా పుష్ప 2 కలెక్షన్లు మాత్రం తగ్గడం లేదు. శనివారం…
ఇంకో పద్దెనిమిది రోజుల్లో విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ ఈ రోజుతో పీక్స్ కు చేరుకోవడం మొదలయ్యింది. మొట్టమొదటిసారి…
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్లో పర్యటిస్తున్నారు. 43 ఏళ్ల తర్వాత.. భారత ప్రధాని కువైట్లో పర్యటించడం ఇదే తొలిసారి. శనివారం…
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…