సినిమా రిలీజుకు మరికొద్ది గంటల సమయం ఉందనగా మెగా ఫ్యాన్స్ కు ”గాడ్ ఫాదర్” టీమ్ ఇచ్చిన మెగా ట్విస్ట్ ఏంటో తెలుసా? ఈ సినిమాలో ఒక ఐటెం సాంగ్ కూడా ఉందంటూ ఒక వీడియోను రిలీజ్ చెయ్యడం. నిజానికి ఒరిజినల్ లూసిఫర్ సినిమాలో కూడా అసలు గ్లామర్ ఎలిమెంట్స్ కాని, హీరోయిన్ వంటి రోల్స్ కాని, రొమాన్స్ కాని ఉండదు. కాని చూస్తుంటే తెలుగు వర్షన్లో ఏవో కొన్ని బాగానే ఇరికించినట్లున్నారు.
ముఖ్యంగా ఈ సినిమాలో ఎక్కడ ప్లేస్ చేశారో తెలియదు కాని, ఒక ఐటెం సాంగ్ పెట్టేశారు. బాలీవుడ్ నటి వారినా హస్సేన్ తో ఇప్పుడు బ్లాస్ట్ బేబీ అంటూ ఒక సాంగ్ తీసేశారు. తమన్ కంపోజ్ చేసిన ఈ పాటకు శేఖర్ మాస్టర్ మాంచి ఊర నాటు డ్యాన్సులే తగిలించారులే. అయితే ఈ పాటలో మెగాస్టార్ కూడా ఉంటారా అనేది సినిమాను చూసి తెలుసుకోవాలి కాని, అసలు గాడ్ ఫాదర్ లో ఐటెం సాంగ్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. మొన్నామధ్యన సినిమా గురించి మాట్లాడుతూ.. అసలు సినిమాలో పాటల్లేవ్ హీరోయిన్లేదు అనే ఫీలింగ్ రాదంటూ మెగాస్టార్ సెలవిచ్చిన సంగతి తెలిసిందే. కాని ఇప్పుడు సడన్ గా ఐటెం సాంగ్ ఉందని ఇలా వీడియో ప్రూఫ్ తో సహా వచ్చేస్తే మాత్రం.. కాస్త షాకిచ్చిందంతే.
ఈ మధ్యకాలంలో సాంగ్స్ పెద్దగా హిట్టవకపోయినా కూడా కంటెంట్ బాగుంటే మాత్రం బింభిసారా, కార్తికేయ 2 వంటి సినిమాల్లో బాక్సాఫీస్ దగ్గర్ షేక్ చేశాయంతే. కాబట్టి గాడ్ ఫాదర్ లో పాటలు లేకపోయినా కూడా కంటెంట్ ఎక్కితే మాత్రం బాగానే ఉంటుంది. కాని ఇలా ఐటెం సాంగులూ అవీ దించేస్తే.. ప్రేక్షకులు మిగతా కమర్షియల్ ఎలిమెంట్లు కూడా ఉన్నాయని ఎక్కువగా ఊహించుకుని లాస్టుకి డిజప్పాయింట్ అయిపోతారేమో. ఆడియో పరంగా పెద్దగా గొప్పగా లేని ఈ పాటకు దియేటర్లో వీడియోతో ఎలా ఉంటుందో చూడాలి మరి.
This post was last modified on October 5, 2022 10:00 am
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…
వైసీపీ తీరు మారలేదు. ఒకవైపు.. ఇండియా కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు ఆ పార్టీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు…
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…