Movie News

అక్క‌డ టికెట్లు దొర‌క‌ట్లా.. ఇక్క‌డ వెల‌వెల‌


గ‌త వారాంతంలో పాన్ ఇండియా స్థాయిలో విడుద‌లైన భారీ చిత్రం పొన్నియ‌న్ సెల్వ‌న్ బాక్సాఫీస్ ప‌రిస్థితి చాలా చిత్రంగా క‌నిపిస్తోంది. ఈ సినిమాను త‌మిళ ప్రేక్ష‌కులు ఒక క‌ళాఖండంలా చూస్తున్నారు మొద‌ట్నుంచి. దీని విష‌యంలో వాళ్ల ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ ఒక రేంజిలో జ‌రిగాయి. సినిమాకు అక్క‌డ ఫుల్ పాజిటివ్ టాక్ వ‌చ్చింది. స‌మీక్ష‌లన్నీ సూప‌ర్ అన్న‌ట్లుగానే వ‌చ్చాయి. రిలీజ్ త‌ర్వాత సినిమాకు వ‌సూళ్లు కూడా మామూలుగా లేవు.

తొలి రోజు నుంచి త‌మిళ‌నాడు అంత‌టా ప్యాక్డ్ హౌసెస్‌తో న‌డుస్తోంది. వీకెండ్ త‌ర్వాత కూడా పొన్నియ‌న్ సెల్వ‌న్‌కు టికెట్లు దొర‌క‌డం క‌ష్టంగా ఉంది. ఆన్ లైన్లో చూస్తే సోల్డ్ ఔట్, ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్‌లో ఉన్నాయి థియేట‌ర్ల‌న్నీ. కేర‌ళ‌లో త‌మిళులు ఎక్కువ‌గా ఉంటారు కాబ‌ట్టి అక్క‌డ కూడా సినిమాకు మంచి వ‌సూళ్లే వ‌స్తున్నాయి. యుఎస్‌లో త‌మిళులు ఈ సినిమాను బాగానే చూస్తున్నారు.

కానీ పొన్నియ‌న్ సెల్వ‌న్‌ త‌మిళయేత‌ర వెర్ష‌న్ల‌న్నీ ప్రేక్ష‌కులు లేక వెల‌వెల‌బోతున్నాయి. ఈ సినిమా త‌మిళం కాకుండా కొంత ప్ర‌భావం చూపించింది తెలుగులో మాత్ర‌మే. ఇక్క‌డ నెగెటివ్ టాక్ వ‌చ్చినా స‌రే.. సినిమా గురించి పెద్ద చ‌ర్చే జ‌రిగింది. బేసిగ్గా ఇలాంటి భారీ చిత్రాల ప‌ట్ల మ‌న ప్రేక్ష‌కుల్లో ఉండే ఆస‌క్తి, అందులోని కాస్ట్ అండ్ క్రూతో మ‌న‌వాళ్ల‌కు ఉన్న అనుబంధం వ‌ల్ల తొలి వీకెండ్లో పొన్నియ‌న్ సెల్వ‌న్ ఓ మోస్త‌రు వ‌సూళ్లు రాబ‌ట్టింది.

కానీ ఆదివారం త‌ర్వాత సినిమా చ‌ల్ల‌బ‌డిపోయింది. సోమ‌వారం ఉద‌యం నుంచి థియేట‌ర్లు ఖాళీ అయిపోయాయి. సాయంత్రం షోలకు కూడా జ‌నాలు లేని ప‌రిస్థితి. మ‌న ప్రేక్ష‌కుల దృష్టి ఇక ద‌స‌రా సినిమాల మీదికి మ‌ళ్లిన‌ట్లే ఉంది. ఇంకో రెండు రోజులాగితే గాడ్ ఫాద‌ర్, ది ఘోస్ట్ సినిమాలు వ‌స్తాయ‌ని చూస్తున్నట్లున్నారు. పొన్నియ‌న్ సెల్వ‌న్‌ను ప‌క్క‌న పెట్టేశారు. ఇక్క‌డ సినిమా థియేట్రిక‌ల్ ర‌న్ దాదాపు ముగింపు ద‌శ‌కు వ‌చ్చేసిన‌ట్లే. ఈ చిత్రాన్ని తెలుగులో పంపిణీ చేసిన దిల్ రాజుకు ఎదురు దెబ్బ త‌గిలిన‌ట్లే క‌నిపిస్తోంది.

This post was last modified on October 4, 2022 11:05 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఆ ప్రచారంపై మండిపడ్డ కోమటిరెడ్డి

తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…

53 minutes ago

అమరావతిపై మాట్లాడే నైతిక హక్కు ఉందా జగన్!

ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…

1 hour ago

నాగ్ ఓకే అనడమే ఆలస్యం

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్‌కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…

2 hours ago

ప్రభాస్ సరదాలు ఓవర్… ఇక సమరమే!

ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…

2 hours ago

పందెం రాయుళ్లకు తిప్పలు తప్పవా…?

సంక్రాంతి వచ్చేసింది.. తోడుగా సందడిని తీసుకువచ్చింది. ఆ సందడికి కోడిపందాల హడావుడి కూడా తోడైంది. ఏటా ఏపీలోని కొన్ని జిల్లాల్లో…

3 hours ago

అమరావతిపై 48 గంటల్లో టోన్ మార్చిన వైసీపీ!

ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సోకాల్డ్ రాజధాని అంటూ అమరావతిని…

3 hours ago