ఈ దసరాకు మూడు తెలుగు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అందులో ట్రైలర్‌తో బాగా ఆకట్టుకున్నది, ఎక్కువ ప్రామిసింగ్‌గా కనిపిస్తున్న సినిమా ఏది అంటే.. ది ఘోస్ట్ అనే చెప్పాలి. అక్కినేని నాగార్జున హీరోగా గరుడ వేగ దర్శకుడు ప్రవీణ్ సత్తారు రూపొందించిన ఈ చిత్రం మొదట్నుంచి కొంచెం కొత్తగా ఉన్న, ఆసక్తికరమైన ప్రోమోలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి సినిమా గాడ్ ఫాదర్ బడ్జెట్, బిజినెస్.. అన్ని రకాలుగా దీంతో పోలిస్తే పెద్ద సినిమానే అయినప్పటికీ.. అది రీమేక్ కావడం, దాని ప్రోమోలు మామూలుగా అనిపించడంతో అనుకున్నంత హైప్ రాలేదు.
కంటెంట్ పరంగా చూస్తే కచ్చితంగా ది ఘోస్ట్‌యే పైచేయి సాధిస్తుందని అంతా అంచనా వేస్తున్నారు. మరో దసరా సినిమా స్వాతిముత్యంకు పెద్దగా బజ్ అయితే కనిపించడం లేదు. ఐతే ది ఘోస్ట్ ప్రోమోలు ఎంత ఆసక్తికరంగా అనిపిస్తున్నా, దాని పట్ల ప్రేక్షకుల్లో ఎంత ఆసక్తి ఉన్నా.. అది ప్రి రిలీజ్ బుకింగ్స్ విషయంలో ప్రతిఫలించట్లేదు.
దసరా సినిమాలకు ఆల్రెడీ బుకింగ్స్ మొదలయ్యాయి. పండుగ బుధవారం కావడంతో వీకెండ్ దాకా ఆగకుండా ఆ రోజే సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. అందుకు తగ్గట్లే బుకింగ్స్ కూడా ముందుగానే మొదలయ్యాయి. మూడు చిత్రాలకూ ఆశించిన స్థాయిలో అయితే బుకింగ్స్ జరగట్లేదు. ఉన్నంతలో చిరు సినిమా పరిస్థితే మెరుగ్గా ఉంది. ఒకప్పుడైతే ఆయన సినిమాలకు ఇలా టికెట్లు పెడితే అలా అయిపోయేవి. కానీ ఆచార్య నుంచి పరిస్థితి మారి.. గాడ్ ఫాదర్‌కు కూడా ఓ మోస్తరుగానే బుకింగ్స్ జరుగుతున్నాయి.
దాంతో పోలిస్తే ది ఘోస్ట్ పరిస్థితి ఏమాత్రం బాగా లేదు. ఎక్కడా ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్ అన్నదే కనిపించడం లేదు. మేజర్ షోలకు 20 శాతానికి మించి బుకింగ్స్ అయిన దాఖలాలు కనిపించడం లేదు. ఈ సినిమా వెంటనే చూసేయాలన్న ఉత్సాహం అయితే జనాల్లో లేనట్లే కనిపిస్తోంది. టాక్ వచ్చాక చూసుకుందాం అనుకుంటున్నట్లున్నారు. కాబట్టి సినిమాకు పాజిటివ్ టాక్ రావడం చాలా ముఖ్యం. అది వచ్చిందంటే వీకెండ్‌కు సినిమా బాగా పుంజుకుంటుందేమో.
This post was last modified on October 3, 2022 10:51 pm
ప్రభాస్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న స్పిరిట్ కు రంగం సిద్ధమవుతోంది. చేతిలో ఉన్న ఫౌజీ, ది రాజా సాబ్…
రెండేళ్ల క్రితం బేబీ రిలీజ్ ముందు వరకు తనెవరో పెద్దగా పరిచయం లేని పేరు. అల వైకుంఠపురములో అల్లు అర్జున్…
తమిళనాట అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ... అధికార డీఎంకేలో ఫుల్ జోష్ నింపే పరిణామం ఒకటి శనివారం జరిగింది. సుప్రీంకోర్టులో రెండేళ్లుగా…
హర్యానాలోని సోనిపట్‌లో ఉన్న ఓపీ జిందాల్ విశ్వవిద్యాలయంలో ఓ విద్యార్థి చేసిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది.…
మాజీ ఉప రాష్ట్రపతి, బీజేపీ నాయకుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు.. తాజాగా అటు తెలంగాణ, ఇటు ఏపీ నేతలపై సెటర్లు గుప్పించారు.…
కొన్నిసార్లు బాక్సాఫీస్ ఫలితాలు అనూహ్యంగా ఉంటాయి. టాక్ తేడాగా వచ్చినా, జనానికి పూర్తిగా నచ్చకపోయినా కలెక్షన్లు మాత్రం భీభత్సంగా వచ్చేస్తాయి.…