Movie News

మహేష్‌తో పోల్చి చిరును ట్రోల్ చేస్తునారు


‘ఆచార్య’ విడుదలకు ముందు, తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఆ సినిమా, అలాగే దాని దర్శకుడు కొరటాల శివ గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి. సినిమా విడుదలకు ముందు కొరటాల శివను చిరు ఎంతగా పొగిడాడో, ఆయనకు ఎంత ఎలివేషన్ ఇచ్చారో అందరికీ తెలుసు. కానీ రిలీజ్ తర్వాత మాత్రం ‘ఆచార్య’ డిజాస్టర్ కావడానికి కొరటాలదే బాధ్యత అన్నట్లుగా మాట్లాడుతుండడం విమర్శలకు దారి తీస్తోంది. ఈ విషయంలో ఇంతకుముందే ఒకట్రెండు సందర్భాల్లో పరోక్షంగా చిరు చేసిన వ్యాఖ్యలు చాలామందికి రుచించలేదు.

తాజాగా ఫిల్మ్ కంపానియన్ ఇంటర్వ్యూలో.. ఆ సినిమా విషయంలో రిగ్రెట్ లేదని, ఎందుకంటే అది డైరెక్టర్ ఛాయిస్ అని, ఆయన చెప్పిందే తాము చేశామని అన్నాడు చిరు. హిట్టయితే క్రెడిట్ తీసుకుని, ఫ్లాప్ అయితే మాత్రం దర్శకుడి మీదికి తోసేస్తారా అంటూ చిరు మీద యాంటీ ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారిప్పుడు.

ఈ సందర్భంగా మహేష్ బాబు ఒక సందర్భంలో అన్న మాటలను గుర్తు చేస్తున్నారు. ఒక సినిమా ఫ్లాప్ అయితే అందుకు ప్రధాన బాధ్యత తానే తీసుకుంటానని మహేష్ అన్నాడు అప్పుడు. అందుకు కారణమేంటో కూడా వివరించాడు. సినిమా కథను ఓకే చేసింది తనే కాబట్టి.. తాను నో చెప్పి ఉంటే ఆ సినిమా తెరకెక్కేదే కాదు కదా.. కాబట్టి తాను బాధ్యత వహించాల్సిందే అని మహేష్ తెలిపాడు. హిట్టయితే ఆ క్రెడిట్ అందరికీ దక్కుతుందని కూడా చెప్పాడు.

ఇక మరో సందర్భంలో మహేష్ గురించి దర్శక రత్న దాసరి నారాయణరావు మాట్లాడుతూ.. ‘దూకుడు’ సినిమా అంత పెద్ద హిట్టవడం పూర్తిగా శ్రీను వైట్ల క్రెడిటే అని, అతను చెప్పినట్లే తాను చేశానని మహేష్ తనతో అన్నాడని, అలాగే ‘బిజినెస్ మేన్’ విషయంలోనూ క్రెడిట్ అంతా పూరీ జగన్నాథ్‌కే ఇచ్చాడని.. ఇది మహేష్‌లో ఉన్న గొప్ప లక్షణం అని దాసరి కొనియాడిన వీడియోను కూడా నెటిజన్లు ఇప్పుడు షేర్ చేస్తూ చిరును విమర్శిస్తున్నారు.

మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ గురించి రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో చెబుతూ.. తారక్‌కు ఫ్లాపులు ఇచ్చిన దర్శకుల గురించి ఒక్క సందర్భంలోనూ నెగెటివ్‌గా మాట్లాడలేదని, ఎవరినీ పల్లెత్తు మాట అనలేదని చెప్పిన మాటలను కూడా గుర్తు చేస్తూ చిరు మీద విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తంగా చూస్తే ఈ వ్యవహారంలో చిరు బాగానే అన్ పాపులర్ అయ్యాడన్నది వాస్తవం. సినిమా హిట్టయితే తన ఇన్‌పుట్స్ గురించి, తన జడ్జిమెంట్ గురించి చెప్పుకునే చిరు.. ఫ్లాప్ అయితే అందుకు తన బాధ్యతేమీ లేదని, పూర్తిగా దర్శకుడిదే రెస్పాన్సిబిలిటీ అని మాట్లాడడం ఎంత వరకు కరెక్ట్ అని, ఇకనైనా ఆయన మారాల్సిన అవసరం ఉందని నెటిజన్లు హితవు పలుకుతున్నారు.

This post was last modified on October 2, 2022 5:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మళ్లీ టాలీవుడ్‌కు రాధికా ఆప్టే

బాలీవుడ్లో విలక్షణ పాత్రలతో మంచి గుర్తింపు సంపాదించి.. దక్షిణాదిన కూడా కొన్ని సినిమాల్లో నటించింది రాధికా ఆప్టే.. ‘ధోని’, ‘కబాలి’ చిత్రాల్లో నటించిన…

23 minutes ago

కదిలిస్తున్న ‘మంచు’ వారి వీడియో

మంచు ఫ్యామిలీ గొడవ గత కొన్ని రోజులుగా మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోన సంగతి తెలిసిందే. తండ్రీ కొడుకులు.. అన్నదమ్ములు…

1 hour ago

రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నా.. జ‌గ‌న్ భ‌ర‌తం ప‌డ‌తా!

"ఈ రోజు నుంచే.. ఈ క్ష‌ణం నుంచే నేను రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నా.. ఏ పార్టీలో చేరేదీ త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తా. జ‌గ‌న్…

1 hour ago

శ్రీవారికి త‌ల‌నీలాలు స‌మ‌ర్పించిన ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌తీమ‌ణి!

తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నం కోసం వ‌చ్చిన ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్ స‌తీమ‌ణి, ఇటాలియ‌న్ అన్నాలెజెనోవో తిరుమ‌ల…

1 hour ago

సుందరకాండకు సమస్యలు ఎందుకొచ్చాయి

నారా రోహిత్ కొత్త సినిమా సుందర కాండ టీజర్ వచ్చి తొమ్మిది నెలలు దాటేసింది. అప్పుడెప్పుడో సెప్టెంబర్ రిలీజ్ అనుకున్నారు…

4 hours ago

స్టూడెంట్‌గా దాచుకున్న సొమ్ము నుంచి కోటి ఖ‌ర్చు చేశా: నారా లోకేష్‌

మంగ‌ళగిరి నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి కోసం.. స్టూడెంట్‌గా ఉన్న‌ప్పుడు.. తాను దాచుకున్న సొమ్ము నుంచి కోటి రూపాయ‌ల‌ను ఖర్చు చేసిన‌ట్టు మంత్రి…

6 hours ago