మెగాస్టార్ చిరంజీవికి అల్లు రామలింగయ్య కూతురైన సురేఖతో పెళ్లి ఎలా జరిగింది? దీని వెనుక కథేంటి? ఆ విశేషాలను స్వయంగా చిరు మాటల్లో తెలుసుకుంటే ఎంత బాగుంటుందో కదా? అల్లు రామలింగయ్య శత జయంతి వేడుకల సందర్భంగా చిరు ఈ కథను అందరితోనూ పంచుకున్నారు. ఆ ఆసక్తికర విశేషాలేంటో చిరు మాటల్లోనే తెలుసుకుందాం పదండి.
“మనవూరి పాండవులు సినిమాలో తొలిసారిగా నాకు అల్లు రామలింగయ్య గారితో పరిచయం జరిగింది. షూటింగ్ గ్యాప్‌లో ఆయన నా వ్యక్తిగత విషయాలు అడిగారు. తర్వాత మరో సినిమాకు కూడా ఆయనతో కలిసి పని చేశాను. ఆ టైంలో షూటింగ్ సందర్భంగా నాతో పాటు ఉన్న మిగతా ఆర్టిస్టులు అమ్మాయిలతో ముచ్చట్లు పెడుతుంటే.. నేను మాత్రం గుర్రపు రేసుల మీద దృష్టిపెట్టా. అమ్మాయిల జోలికే వెళ్లలేదు. తర్వాత షూటింగ్ కోసమని రైల్లో కోస్తా ప్రాంతానికి వెళ్తుండగా.. రావుగోపాల్రావు గారు, అల్లు రామలింగయ్య గారు రైల్లో సీసా ఓపెన్ చేస్తూ నన్ను కూడా కలవమన్నారు. నేను ఆంజనేయ భక్తుణ్ని అలవాటు లేదని చెప్పా ఇదంతా చూసి నా మీద ఆయనకు మంచి అభిప్రాయం కలిగినట్లుంది. నా తొలి చిత్ర నిర్మాత అయిన జయకృష్ణను నా దగ్గరికి పంపించి పెళ్లి గురించి మామూలుగా అభిప్రాయం అడిగించారు. కెరీర్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాం. ఇంకో ఐదారేళ్లు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్పా.
కానీ అల్లు రామలింగయ్య గారు, జయకృష్ణ, అల్లు అరవింద్ వీళ్లంతా కలిసి కూర్చుని మాట్లాడుకుని నాకు సురేఖను ఇచ్చి పెళ్లి చేసేయ్యాలని ఫిక్సయ్యారు. జయకృష్ణ వెళ్లి నెల్లూరులో ఉన్న మా నాన్న గారిని కలిశారు. ఫిలిం ఇండస్ట్రీలో అమ్మాయిలు మామూలు వాళ్లు కాదని, నన్ను వలలో వేసుుకంటారని, తర్వాత అబ్బాయి మనకు కాకుండా పోతాడని, అల్లు వారిది మంచి కుటుంబం అని, పెళ్లి చేసుకుంటే భోజనానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని.. ఇలా ఏవేవో మాటలు చెప్పి నాన్నను ఒప్పించారు. ఆయన నన్ను కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు.
నేను ముందు నో అన్నప్పటికీ.. తర్వాత పెళ్ళిచూపులకు వెళ్లాను. సురేఖను చూడగానే నా ఆలోచన కొంచెం మారింది. తర్వాత ఇంకో రోజు వాళ్లింటికి కాఫీకి పిలిచారు. సురేఖ పెట్టిన కాఫీ తాగాక పడిపోయాను. ఇంక ఊ అనడమే తప్ప, ఊహూ అనడానికి వీల్లేకపోయింది. ఆ టైంలో ఎం.ఎస్.రెడ్డి గారి బేనర్లో ఒక సినిమాతో పాటు వేరే మూణ్నాలుగు సినిమాలు చేస్తున్నా. పెళ్లి చేసుకోవడానికి కూడా ఖాళీ లేదు. అప్పుడు అరవింద్ ఎం.ఎస్.రెడ్డిగారిని ఒప్పించి మూడు రోజులు పెళ్లి కోసం సెలవు ఇప్పించారు” అని చిరు గుర్తు చేసుకున్నారు.
This post was last modified on October 2, 2022 3:02 pm
స్విట్జర్లాండ్లోని దావోస్లో సోమవారం నుంచి ప్రారంభమైన ప్రపంచ పెట్టుబడుల సదస్సుకోసం వెళ్లిన.. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్,…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు టాప్ జాబ్ విషయంలో పార్టీ శ్రేణుల నుంచి పెద్ద ఎత్తున…
వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు జరిగే దావోస్ వేదిక… ఎటు చూసిన రిచ్ లుక్ తో కనిపిస్తుంది. అక్కడ ఓ…
మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ కెరీర్ కొన్నేళ్ల నుంచి తిరోగమనంలో పయనిస్తోంది. అతడికి సోలో హీరోగా ఓ మోస్తరు…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్… ఎలా కనిపిస్తారు? గతంలో అయితే అప్పుడప్పుడూ లైట్ కలర్…
ఏపీ సీఎం చంద్రబాబు నోటి నుంచి ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు వెలువడ్డాయి. మరో జన్మ అంటూ ఉంటే.. మళ్లీ తెలుగు వాడిగానే…