స‌ల్మాన్ వ‌ద్ద‌న్నా.. చ‌ర‌ణ్ ఒప్పుకోకుండా


మెగాస్టార్ చిరంజీవి కుటుంబంతో బాలీవుడ్ సూప‌ర్ స్టార్ స‌ల్మాన్ ఖాన్ అనుబంధం గురించి కొత్త‌గా చెప్పాల్సిన ప‌ని లేదు. స‌ల్మాన్ ఎప్పుడు హైద‌రాబాద్‌లో షూటింగ్ కోసం వ‌చ్చినా ఆయ‌న‌కు చిరు ఇంటి నుంచే క్యారియ‌ర్ వెళ్తుంద‌ని అంటారు. అలాగే చిరు, చ‌ర‌ణ్‌ల్లో ఎవ‌రు ముంబ‌యికి వెళ్లినా స‌ల్మాన్ ఇంట్లోనే ఉంటార‌ని కూడా చెబుతారు. ఈ అనుబంధం నేప‌థ్యంలోనే చిరు కొత్త చిత్రం గాడ్ ఫాద‌ర్‌లో ఒక క్యామియో రోల్ చేశాడు స‌ల్మాన్. ఇందుకు గాను స‌ల్మాన్ పారితోష‌కం కూడా ఏమీ తీసుకోలేద‌ని స‌మాచారం.

ఇందుకు ప్ర‌తిగా స‌ల్మాన్ సినిమాకు త‌న వంతు సాయం చేయ‌డానికి చ‌ర‌ణ్ రెడీ అయిన విష‌యంలో వెల్ల‌డైంది. స‌ల్మాన్ హీరోగా ప్ర‌స్తుతం కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ అనే సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో టాలీవుడ్ సీనియ‌ర్ హీరో విక్ట‌రీ వెంకటేష్ ఒక ప్ర‌త్యేక పాత్ర చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

కాగా ఇందులో చ‌ర‌ణ్ సైతం ఒక క్యామియో చేస్తుండ‌డం విశేషం. గాడ్ ఫాద‌ర్ హిందీ ట్రైల‌ర్ లాంచ్ కార్య‌క్ర‌మంలో ఈ విష‌యాన్ని స‌ల్మానే ఒప్పుకున్నాడు. ఈ సినిమాలో మీతో క‌లిసి చ‌రణ్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడ‌ట క‌దా అని ఒక విలేక‌రి స‌ల్మాన్‌ను అడ‌గ్గా.. ముందు ఒకింత ఆశ్చ‌ర్యానికి గుర‌య్యాడు స‌ల్మాన్. ఈ విష‌యం మీకెవ‌రు చెప్పారు.. అది నిజ‌మా అని ప్ర‌శ్నించిన స‌ల్మాన్.. త‌ర్వాత ఆ విష‌యం వాస్త‌వ‌మే అని చెప్పాడు.

ఒక రోజు రామోజీ ఫిలిం సిటీలో తాను, వెంక‌టేష్ క‌లిసి ఒక పాట చిత్రీక‌ర‌ణ‌కు రెడీ అవుతుంటే.. చ‌ర‌ణ్ వ‌చ్చి క‌లిశాడ‌ని.. తాను కూడా ఈ పాట‌లో భాగం కావాల‌నుకుంటున్న‌ట్లు తెలిపాడని.. ఐతే తాను వ‌ద్దు వ‌ద్దు అన్నాన‌ని.. కానీ చ‌ర‌ణ్ విన‌కుండా మ‌రుస‌టి రోజు కార‌వాన్ తీసుకుని, త‌న కాస్ట్యూమ్ త‌నే రెడీ చేసుకుని షూటింగ్ స్పాట్‌కు వ‌చ్చేశాడ‌ని.. అలా అత‌ను కూడా తాను, వెంకీతో క‌లిసి ఒక పాట‌లో త‌ళుక్కుమ‌న్నాడ‌ని స‌ల్మాన్ వెల్ల‌డించాడు. ఫ‌ర్హాద్ సామ్‌జీ రూపొందిస్తున్న కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ ఈ ఏడాది డిసెంబ‌రు 30న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.