Movie News

చిరు-సల్మాన్ ఎదురుగా అతను నిలుస్తాడా?


మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘గాడ్ ఫాదర్’ విడుదలకు ఇంకో నాలుగు రోజులే సమయం ఉంది. అన్ని సందేహాలకూ తెరదించుతూ ఈ చిత్రం అక్టోబరు 5న దసరా రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన థియేట్రికల్ ట్రైలర్ మరీ గొప్పగా లేదు. అలాగని తీసిపడేసేలా కూడా లేదు. మలయాళ మాతృక ‘లూసిఫర్’తో పోలిస్తే తెలుగులో చేసిన మార్పులు చేర్పులు ఏంటన్నది ట్రైలర్ చూస్తే దాదాపుగా అర్థం అయిపోయింది. ఒరిజినల్లో ఉన్న టొవినో థామస్ పాత్రను తెలుగులో పూర్తిగా తీసేసినట్లే ఉన్నారు.

‘గాడ్ ఫాదర్’ సినిమాలో సత్యదేవ్ చేసింది మాతృకలో టొవినో చేసిన క్యారెక్టరే అని ముందు అంతా అనుకున్నారు. కానీ తీరా చూస్తే ఆ పాత్రే ట్రైలర్లో కనిపించకపోవడం, సత్యదేవ్ క్యారెక్టర్లో నెగెటివ్ షేడ్స్ కనిపించడంతో అతడిది వివేక్ ఒబెరాయ్ పాత్ర అని అర్థమవుతోంది. ఐతే సత్యదేవ్‌కు ఉన్న ఇమేజ్‌కు ఈ చిత్రంలో మెయిన్ విలన్ పాత్రకు సరిపోతాడా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

సత్యదేవ్ తన కెరీర్లో చాలా వరకు పాజిటివ్ క్యారెక్టర్లే చేశాడు. అతడికి సాఫ్ట్ ఇమేజ్ ఉంది. ‘రాగల 24 గంటల్లో’ లాంటి ఒకటీ అరా చిత్రాల్లో మాత్రమే నెగెటివ్ రోల్స్ చేశాడు. అవి కూడా జనాల దృష్టిలో పడ్డాడు. ఇక హీరోగా అతడి స్థాయి తక్కువే. ఇంకా చిన్న సినిమాల హీరోగానే కొనసాగుతున్నాడు. నాని లాగా మిడ్ రేంజిలోకి కూడా రాలేకపోతున్నాడు. సత్యదేవ్ మంచి నటుడే కానీ.. అతడికి ఇంకా స్టార్ ఇమేజ్ రాకపోవడం వల్ల మెగాస్టార్ చిరంజీవి, సల్మాన్ ఖాన్ లాంటి సూపర్ స్టార్లకు ఎదురుగా విలన్‌గా నిలబడే స్థాయి తనకు ఉందా అన్న ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒక పెద్ద హీరో అంటే ఎదురుగా విలన్‌‌గా ఒక స్టేచర్ ఉన్న నటుడు ఉండాలని ప్రేక్షకులు ఆశిస్తారు.

మనకు పరిచయం లేని పరభాషా నటుడెవరినైనా తీసుకొచ్చినా ఓకే కానీ.. ఇక్కడ పరిచయం చిన్న స్థాయి, సాఫ్ట్ ఇమేజ్ ఉన్న నటుడిని విలన్‌గా పెడితే ఆ పాత్రకు న్యాయం జరుగుతుందా? చిరు ముందు సత్యదేవ్‌ అసలు విలన్‌గా నిలబలగలడా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరి విలన్‌గా ప్రేక్షకులు సత్యదేవ్‌ను ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఒకవేళ ఇప్పుడు అందరూ అంచనా వేస్తున్నట్లు విలన్‌గా అతను కాకుండా వేరే నటుడున్నాడా.. అతడి పాత్రను సర్ప్రైజ్ లాగా ఏమైనా దాచి పెట్టారా అన్నది చూడాలి.

This post was last modified on October 1, 2022 3:43 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అట్టహాసంగా ప్రారంభమైన ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు

సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…

3 minutes ago

టీడీపీలో సీనియ‌ర్ల రాజ‌కీయం.. బాబు అప్ర‌మ‌త్తం కావాలా?

ఏపీలోని కూట‌మి స‌ర్కారులో కీల‌క పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియ‌ర్ నాయ‌కుల వ్య‌వ‌హారం కొన్నాళ్లుగా చ‌ర్చ‌కు వ‌స్తోంది. సీనియ‌ర్లు స‌హ‌క‌రించ‌డం…

5 hours ago

రేవంత్ సర్కారు సమర్పించు ‘మహా’… హైదరాబాద్

కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…

6 hours ago

లెక్క‌లు తేలుస్తారా? అమిత్ షాకు చంద్ర‌బాబు విన్న‌పాలు ఇవీ!

ఏపీ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్ర‌నేత అమిత్ షా వ‌ద్ద ఏపీ సీఎం చంద్ర‌బాబు…

7 hours ago

స‌స్పెండ్ చేస్తే.. మాతో క‌ల‌వండి: టీడీపీ నేత‌కు వైసీపీ ఆఫ‌ర్‌?

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుంద‌న్న‌ది చెప్ప‌లేం. రాజ‌కీయాలు రాజ‌కీయాలే. ఇప్పుడు ఇలాంటి ప‌రిణామ‌మే ఎన్టీఆర్ జిల్లాలోనూ జ‌రుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…

8 hours ago

షా, బాబు భేటీలో వైఎస్ ప్రస్తావన

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…

9 hours ago